Friday, March 29, 2024
- Advertisement -

శునకాన్ని అరెస్ట్ చేసిన పోలీసులు… ఎందుకో తెలుసా…?

- Advertisement -

పోలింగ్‌కు రెండు రోజుల ముందు అన్ని పార్టీలు త‌మ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముగించ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత ఎవ‌రు ప్ర‌చారం చేసినా వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వు. అలాంటిది ఎన్నిక‌లు జ‌ర‌గుతున్న రోజున బీజేపీకి ఓటేయాలంటూ వీధుల్లో ప్రచారం చేస్తే ఊరుకుంటారా? ఈసీ నిబంధనలను అమలు చేసే విషయంలో తమకు మనుషులైనా, జంతువులైనా ఒకటేనని నిరూపించారు మహారాష్ట్ర పోలీసులు. భాజాపాకు ప్ర‌చారం చేస్తోంద‌న్ని ఆరోప‌న‌ల‌పై కుక్క‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.

వివ‌రాల్లోకి వెల్తే….అది ఏక్ నాథ్ మౌతీరాం ఇష్టంగా పెంచుకుంటున్న కుక్క. దాని మెడకు… బీజేపీ జెండాను తగిలించాడు. దాన్ని ఎలా వ‌దిలించుకోవాలో తెలియ‌ని శున‌కం రోడ్ల‌మీద తిర‌డం ప్రారంభించింది. మెడ‌లో భాజాపా జెండా త‌గిలించుకొని ప్ర‌చారం చేస్తె ఊరుకుంటారా…? చాలా మంది రోడ్డున పోతున్న ఆ కుక్కను చూసి… ఇదేంటి… చివరకు కుక్కలు కూడా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయా అని ఆశ్చర్యపోయారు. ఇంకొందరైతే… అయ్యో… కుక్కకు జెండా కట్టారేంటీ… ఎవడ్రా నాయనా ఈ పని చేసిందని ఎవ‌రికి వారు అనుకున్నారు.

ఇక రాజ‌కీయ పార్టీలు ఊరుకుంటాయా…! పార్టీల నేతలు ఈ విషయాన్ని మహారాష్ట్ర ఎన్నికల అధికారులకు చేరవేశారు. అంతే అధికారులు అదేదో తీవ్రమైన నేరం అన్నట్లు వేగంగా రంగంలోకి దిగారు. ఆ కుక్క ఎక్కడుందో ఆ నోటీ ఈ నోటా తెలుసుకొని… దాన్ని చేరుకున్నారు.

ఓటర్లను ప్రభావితం చేసేలా ఆయన చర్యలు ఉన్నాయని తేల్చిన పోలీసులు ఏక్ నాథ్ పై కేసు పెట్టి, ఆ కుక్కను కూడా స్టేషన్ కు తరలించారు. దాని ఆలనా, పాలనా తాము చూడలేమని, వెంటనే ఈ శునకాన్ని తీసుకెళ్లాలని మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బందికి పోలీసులు సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -