Tuesday, April 23, 2024
- Advertisement -

మందుబాబుల‌కు షాక్… మ‌ద్యంపై నిషేధం..కిక్కిరిసిన మ‌ద్య దుకాణాలు

- Advertisement -

ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌ధ్యంలో మ‌ద్యం బాబుల‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ షాక్ ఇచ్చింది. ఒక వైపు ఎన్నిక‌ల ఫ‌లితాలు తెలుసుకుంటూ మ‌రో వైపు చికెనో, మటనో లాగిస్తూ… మరో పక్క నుంచీ మద్యం బాటిల్ పైకెత్తుతూ హంగామా చేసె మందు ప్రియుల‌కు చేదు వార్త‌. ఉద‌యం 8 గంట‌ల‌నుంచి కౌంటింగ్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. దేశ రాజకీయాలతోపాటు… ఏపీలో ఎవరు అధికారం చేపడతారా అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ స‌మ‌యంలో గురువారం ఉదయం 6 గంటల నుంచీ శుక్రవారం ఉదయం 6 గంటల వరకూ మద్యం షాపులు తెరవకూడదని సీఈసీ ఆదేశాలు జారీచేసింది. దీంతో ఏపీలో ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణాలు, వైన్స్‌, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి కావడం, హైదరాబాద్‌లో ఉంటున్న చాలా మంది ఏపీ నేతలు… అమరావతికి క్యూ కట్టడంతో… ఇప్పుడు అక్కడ మద్యానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అన్ని పార్టీవాల్లు గెలిచేది మేమంటె మేమే అనే ధీమాతో ఉన్నారు.

చాలా మంది నేతలు, తాము కచ్చితంగా గెలుస్తామనీ, పార్టీ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుగానే ఆర్డర్లు ఇచ్చి ఇప్పటికే లక్షల కేసులు కొనేశారు. బుధవారమైతే… మద్యం నిల్వలన్నీ అయిపోయాయట. స్టోర్ పెట్టిన కేసులన్నీ కొనేయడంతో… అప్పటికప్పుడు వేరే ప్రాంతాల నుంచీ తెప్పించాల్సిన పరిస్థితి తలెత్తిందట. ఈసీ కంటె చాలా తెలివైన వాల్లు మ‌న నాయ‌కులు, నేత‌లు, మందుబాబులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -