Thursday, April 25, 2024
- Advertisement -

దివాలా తీసిన బ్రిటన్ ట్రావెల్ దిగ్గజం థామస్ కుక్ కంపెనీ …

- Advertisement -

178 ఏళ్ల చరిత్ర ఉన్న బ్రిటన్ కు చెందిన ట్రావెల్ దిగ్గజం థామస్ కుక్ కంపెనీ దివాలా ప్రకటించింది. దీంతో దీంతో ప్రపంచవ్యాప్తంగా 22వేల ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయి. వీరిలో 9వేల మంది బ్రిటన్‌ వారున్నారు. పీకల్లోతు ఆర్థిక నష్టాల్లో కూరుకు పోయిన కంపెనీ అదనపు నిధుల కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అవడంతో దివాలా ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా థామస్‌కుక్‌ తన విమాన సేవలను నిలిపివేసినట్టుగా బ్రిటిష్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ ప్రకటించింది. థామస్‌కుక్‌కు చెందిన విమాన, హాలిడే బుకింగ్స్‌లను రద్దు చేసినట్టు ప్రకటించింది. సంస్థ పతనం తీవ్ర విచారం కలిగించే విషయమని థామస్ కుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ ఫాంక్‌హౌజర్ ఆదివారం రాత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం యూకేలోకి ప్రముఖ బ్రాండ్లలో థామస్ కుక్ ఒకటి. సోమవారం కంపెనీకి సంబంధించి దివాలా పిటషన్ లండన్ హైకోర్టులో విచారణకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -