విదేశాలకు పారిపోతున్న ప్రియుడితో పెళ్లి చేసిన పోలీసులు..!

1380
love marriage police station chennai tamilnadu
love marriage police station chennai tamilnadu

ఇప్పుడు ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవడం.. అది కుదరకుంటే మధ్యలోనే విడిపోవడం చాలా మాములు అయిపోయాయి. తాజాగా అందుకు భిన్నంగా ఒక ఘటన జరిగింది. ప్రేమించి మోసం చేసి విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నించిన ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పోలీస్ స్టేషన్ లోనే ప్రియురాలితో వివాహం జరిపించారు.

విషయంలోకి వెళ్తే.. చెన్నై అనకాపుత్తూరు లేబర్‌ పల్లి వీధికి చెందిన కవిత (23) మొలిచలూరు 7వ వీధి అగస్థీశ్వరర్‌ నగర్‌కు చెందిన మెనువేల్‌నే ఇన్నోసా (వెంకటేశ్‌) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కొంతకాలం నుంచి వెంకటేశ్‌ కవితకు కనిపించకుండా తిరుగుతున్నాడు. దాంతో ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంకటేశ్ ను అదుపులోకి తీసుకున్నారు.

కవిత అందంగా లేదని.. అందుకే వదిలించుకునేందుకు ప్రయత్నించానని వెంకటేశ్ చెప్పాడు. దాంతో అతడిని వదిలేస్తే విదేశాలకు వెళ్లిపోతాడని భావించిన పోలీసులు వారికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. వివాహానికి ఇద్దరు సమ్మతించడంతో పోలీసుల సమక్షంలో వెంకటేశ్, కవిత మెడలో తాళి కట్టాడు. ఇష్టపూర్వకంగానే తామిద్దరం పెళ్లి చేసుకున్నట్లు వారిద్దరి చేత రాతపూర్వకంగా ఓ నోట్‌ను పోలీసులు రాయించుకున్నారు.

Loading...