Thursday, April 25, 2024
- Advertisement -

మోగిన ఎన్నికల నగారా.. వచ్చేనెల 21న పోలింగ్

- Advertisement -

కేంద్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో అత్యంత కీలకమైన పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర కాగా.. రెండోది ఉత్తరాదిలోని హర్యానా.. ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలకు ఈసీ నడుం బిగించింది. సెప్టెంబర్ 27న మహారాష్ట్ర, హర్యానాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్టు కేంద్రం ఎన్నికల కమిషనర్ తెలిపారు.

మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లకు, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ను అక్టోబర్ 21న నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇక అక్టోబర్ 24న కౌంటింగ్ నిర్వహించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువరిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపారు.

ప్రస్తుతం ఈ రెండురాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉంది. మహారాష్ట్రలో శివసేనతో పొత్తుతో బీజేపీ ముందుకెళ్లగా.. హర్యానాలో బీజేపీ ఒక్కటే అధికారంలో ఉంది. ఈసారి మహారాష్ట్రలో రైతుల ఉద్యమాలు, కరువు తాండవించింది. ఇక తాజాగా వరదలు పోటెత్తాయి. మరి జనాలు ఆగ్రహంగా ఉన్న వేళ మళ్లీ బీజేపీకి పట్టం కడుతారా లేదా అన్నది చూడాలి.

ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ తో గతంలో ఎన్సీపీ జత కట్టింది. ఇప్పుడు బలమైన బీజేపీని ఎదుర్కోవడానికి మళ్లీ ఎన్సీపీతో కాంగ్రెస్ కలుస్తుందా లేదా అన్నది వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -