Tuesday, March 19, 2024
- Advertisement -

ప్రియుడ్ని పెళ్లాడ‌టంకోసం వివాహిత ఏంచేసిందంటె…?

- Advertisement -

అనైతిక సంబంధాలు ప‌చ్చ‌ని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. ప్రియుళ్ల మోజులో ప‌డి భ‌ర్త‌ల‌ను కూడా చంపుతున్న ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రియుడితో అక్ర‌మ‌సంబంధం కొన‌సాగించ‌డానికి భ‌ర్త‌ను చీట్ చేసిన వైనం వెలుగులోకి వ‌చ్చింది. భ‌ర్త‌ను చంప‌లేదుగాని ప్రియుడిని పెళ్లి చేసుకొనేందుకు భ‌ర్త సంత‌కాన్నే ఫోర్జ‌రీ చేసిందో ఇల్లాలు.

వివ‌రాల్లోకి వెల్తే….మహారాష్ట్రలోని థానేలోని ముంబ్రా ప్రాంతంలో త‌న తొమ్మిదేళ్ల కొడుకుతో కలిసి నివ‌సిస్తోంది. ఆమె భర్త యూసుఫ్ షరీఫ్ మస్తాన్ బతుకుదెరువు కోసం యూఏఈ వెల్లాడు. 2007 నుంచి ఆమె భర్త మస్తాన్ యూఏఈలో మెకానిక్ గా పనిచేస్తున్నాడు. దీన్ని ఆస‌ర‌గా చేసుకొని తన ప్రియుడ్ని పెళ్లి చేసుకోవడం కోసం భర్త సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ విడాకుల పత్రాలను సృష్టించింది.

భ‌ర్త ఇంటి వద్ద‌లేక‌పోవ‌డంతో త‌న పాత ప్రియుడితో సంబంధాల‌ను కొన‌సాగిస్తోంది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో భర్త తనకు విడాకులు ఇచ్చినట్టు అతని సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ విడాకుల డాక్యుమెంట్ సృష్టించింది. అంతేనా…భర్త కొనుగోలు చేసి తన పేరిట రాసిన ఓ ఇంటిని రూ.23 లక్షలకు అమ్మేసి సొమ్ముచేసుకుంది.

మ‌ధ్య‌లో ఇండియా వ‌చ్చిన భ‌ర్త భార్య ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రావ‌డంతో నిల‌దీశాడు.ఎప్పుడూ ఫోన్ లో మాట్లాడుతుండడంతో నిలదీయగా, తన ఫ్రెండ్ అని బుకాయించింది. 2017లో మరోసారి భారత్ రాగా, భర్తను కలిసేందుకు నీలోఫర్ నిరాకరించడమే కాకుండా అతడిని ఇంట్లోకి కూడా అడుగుపెట్టనీయలేదు. దీంతో భార్య గురించి ఆరాతీస్తె అస‌లు గుట్టు బ‌య‌ట‌ప‌డింది. యూఏఈ వెళ్లిపోయి మళ్లీ స్వదేశానికి వచ్చిన మస్తాన్ కు భార్య ఈసారి విడాకుల పత్రాలు చూపించింది. వాటిపై ఉన్న సంతకం ఫోర్జరీ అని వెంటనే గ్రహించిన ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై అరెస్ట్ వారంట్ జారీ అయింది. ప‌రారీలో ఉన్న నీలోఫర్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా థానే కోర్టు తిరస్కరించింది. ఈవ్య‌వ‌హారంలో దోషిగా తేలితే గ‌రిష్టంగా ఏడేళ్లు జైలుశిక్ష‌ప‌డం ప‌డనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -