Friday, April 19, 2024
- Advertisement -

ఓవర్ చేసినందుకు.. ఉన్నది ఊడదీసేసారు

- Advertisement -

పార్టీలో సెంటరాఫ్ అట్రాక్షన్ మనమే కదా అని రెచ్చిపోతే… జరగాల్సిన శాస్త్రి గట్టిగానే జరుగుతుంది. ఇది తెలియక చాలామంది చాలా రకాలుగా ఎక్స్ ట్రాలు చేసి ఇరుక్కుపోతుంటారు. మన తెలుగు సినిమాల్లో ఇలాంటి సీన్లు ఇవివి ,ఎస్ వి కృష్ణారెడ్డి చిత్రాలలో చాలానే కనిపిస్తుంటాయి. అలాంటి సీనే మలేషియాలో జరిగింది. కౌలాలంపూర్‌లోని అలోర్‌ సెతార్‌ అనే ప్రాంతంలో 35 ఏళ్ల వ్యక్తికి అవ్వక అవ్వక ఒకసారి పెళ్లి అయింది. దాంతో గురుడుని ఎవ్వరూ పట్టుకోలేకపోతున్నారు. ఓవర్ టెంప్ట్ అవుతూ ఆ సమయంలో ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నాడు. ఇక్కడ ఇదంతా మనదే అనే బిల్డప్ ఇస్తూ ఓవర్ చేస్తున్నాడు. వీడికి తోడు అక్కడ చాలామంది జమ గూడారు.వీడు ఏదంటే దానికే వంత పాడుతున్నారు.

ఆ ఆనందంలోనే అతని పెళ్లి ఎలాంటి అవాంతరం లేకుండా జరిగిపోయింది. సమీపంలోని హోటల్ లో అతిధులందరికీ గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు. ఆపార్టీకి ఎందరో రకరకాల వ్యక్తులు హాజరయ్యారు. దానిలో ఇతనికి తెలిసిన ఓ క్రిమినల్ కూడా అటెండ్ అయ్యాడు. అతని ముందుకు కూడా మన పెళ్లికొడుకుంగారు బిల్డప్ కొట్టడం షురూ చేశారు. అంతా భాగానే ఉంది. కాని ఒక్కసారిగా ఆ స్పాట్ కు పోలీసులు వచ్చారు. ఆ క్రిమినల్ ఇంతకాలానికి ఇక్కడ దొరికాడనే సమాచారం రావడంతో ఆ పార్టీని మొత్తం పోలీసులు తమ చెప్పు చేతల్లోకి తీసుకున్నారు. విషయం ఎంతో సీరియస్ అయితే తప్ప పోలీసులనేవారు అలాంటి పని చేయరు కదా.

కాని ఈవిషయాన్ని అర్ధం చేసుకోని ఆ కొత్త పెళ్లికొడుకు ఆక్ పాక్ కరే పాక్ …డామ్ డూ మ్ డిష్ అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ లు కొట్టాడు. వీడి మాటలకు తానా తందానా అంటూ ఇతని వైపునుంచి ఓ 40మంది వంతపాడారు. దానిని అదనుగా చూసుకున్న ఆక్రిమినల్ వెనుక కిటికీ నుంచి పారిపోయాడు. అంతే పోలీసులకు ఒక్కసారిగా చిర్తెత్తుకొచ్చింది. పెళ్లికొడుకుతో పాటు ఆ 40 మందికి తమ కస్టడీలోకి తీసుకుని ఓ రుబ్బురుబ్బారు. మిగతా 40మందిని ఒకలా రుబ్బితే.. పెళ్లికొడుకును స్పెషల్ గా ట్రీట్ చేశారు. బాడీలోని కొన్ని కీలక పార్టులు పోలీసుల ట్రీట్ మెంట్ తో పనిచేయకుండా మానేసినంత పని అయిందట. ఆతర్వాత పెళ్లి కొడుకు ఇంటికొస్తే ఏం లాభం.. అబ్బాయిగారికి స్టేషన్ లో శోభనం జరిగిపోయింది..ఇప్పట్లో ఇంటిలో వద్దని అనుచరుల ఆడింగులతో చెప్పడంతో అంతా అవాక్కయ్యారట.

https://www.youtube.com/watch?v=gxhOHvtVc90

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -