Saturday, April 20, 2024
- Advertisement -

కేంద్రాన్ని కోరిన ఇడి

- Advertisement -

అప్పుల ఎగవేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు దేశాన్ని విడిచి పారిపోయిన బడా పారిశ్రామిక వేత్త, ఒకప్పటి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పాస్‌పోర్టును రద్దు చేయాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.

మాల్యా తమకు బాకీ పడిన  9000 కోట్ల రూపాయల బకాయిలు రాబట్టుకునేందుకు ఎస్‌బిఐ కోర్టును ఆశ్రయించింది. ఐడిబిఐ నుంచి మరో 900 కోట్ల రూపాయలు రుణం తీసుకున్న విజయ్ మల్యా ప్రస్తుతం లండన్ ఉన్నట్లు సమాచారం. తాను పారిపోలేదని, త్వరలో ఇండియాకు వస్తానని మాల్యా ట్విట్టర్ లో చెబుతున్నారు.

తమ ముందు హాజరుకావాలంటూ ఇడి తొలిసారిగా మార్చి 19 వతేదిన మాల్యాకు నోటీసులు పంపించింది. ఆ తర్వాత ఏప్రిల్ 2, 9 వ తేదీల్లో కూడా మళ్లీ నోటీసులు జారీ చేసారు. అయితే సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కొంటున్న తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనంటూ మాల్యా ఇడికి సమాధానమిచ్చారు. మాల్యాను భారత్ కు రప్పించేందుకు ఇడి ఆయన పాస్‌పోర్టును రద్దు చేయాలంటూ కేంద్రానికి సిఫార్సు చేసింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -