జాబ్ పోయిందని ఫీల్ అయ్యాడు.. 46 కోట్లు లాటరీ తగిలింది..!

520
man got lottery prize
man got lottery prize

ప్రస్తుతం ప్రజలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇలాంటి సమయంలో చాలా దేశాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. దాంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. దాంతో పూర్తిగా నిరాశకు గురయ్యాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి వారి ఫ్యామిలీలో నెలకొంది. ఇంటిని ఎలా నెట్టుకుని రావాలో అర్దం కావడం లేదు. అలాంటి పరిస్థితిలో అతనికి రూ. 46 కోట్లు లాటరీ తగిలిందని తెలుసుకుని ఎగిరి గంతులేశాడు.

తనకు పట్టిన దురదృష్టం ఇంత త్వరగా వదలి అదృష్టంగా మెరుపు వేగంతో తలుపుతట్టడంతో అతడు అమితానందం వ్యక్తం చేశాడు. పూర్తి విషయంలోకి వెళ్తే.. న్యూజిలాండ్‌లో ఓ వ్యక్తి ఉద్యోగం కోల్పోయాడు. దాంతో ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు. అయితే గతంలో లాటరీకి కొన్నానన్న విషయం అతడు మర్చిపోయాడు. అయితే కంప్యూటర్ ను మాములుగా ఏదో పని మీదా వాడుతుండగా.. వెబ్‌సైట్‌లో లాటరీ ఫలితాలు కనిపించడంతో దాన్ని క్లిక్‌ చేశాడు.

అందులో తాను కొన్న లాటరీ టికెట్‌కు 10.3 న్యూజిలాండ్‌ డాలర్స్ ( దాదాపు రూ.46 కోట్లు) వచ్చాయని తెలుసుకుని ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఈ విషయం తన భార్యకు చెప్పగానే ఆమె చాలా సంతోష పడింది. ఆ డబ్బుతో ఇళ్లు కొంటామని, పిల్లలను బాగా చదివిస్తామని ఆమె మీడియాకు తెలిపింది.

Loading...