Friday, March 29, 2024
- Advertisement -

మంగ‌ళ‌గిరిలో వైసీపీ చేతిలో ఘోర ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకున్న నారా లోకేష్‌..

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముందునుంచి అనుకున్న‌ట్లు వైసీపీ బంప‌ర్ మెజారిటీ గెలిచింది. 150 సీట్ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ మ‌రో చ‌రిత్ర సృష్టించారు. అయితే మొద‌టినుంచి అంద‌రి చూపు మంగ‌ళ‌గిరి నియోజ‌క వ‌ర్గంపైనె ఉండేది. ఎందుకంటె ఇక్క‌డ‌నుంచి టీడీపీ త‌రుపున మంత్రి లోకేష్‌, వైసీపీ అభ్య‌ర్ధి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిపై పోటీ చేశారు. అక్క‌డ గెల‌వ‌డానికి అన్నిఅడ్డ‌దారులు తొక్కినా చివ‌ర‌కు ఆళ్ల చేతిలో ఘోర ప‌రాజ‌యం చ‌విచూశారు.

మంగళగిరిలో లోకేశ్ ఓడిపోతాడని వైసీపీ నాయకులు ఘంటాపథంగా చెబుతున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్‌ మాత్రం లోకేశ్ విజయం సాధిస్తాడని అంచనా వేశాయి. లోకేశ్ గెలుస్తాడా లేదా అనే విషయమై భారీ స్థాయిలో బెట్టింగులు కూడా జరిగాయి. లోకేశ్ విజయం కోసం టీడీపీ రూ.300 కోట్లు ఖర్చు పెట్టిందని వైసీపీ విమర్శించింది.

మంగళగిరిలో 2014లో ఆళ్ల రామకృష్ణా రెడ్డి కేవలం 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై గెలుపొందారు. ఆళ్లకు 88,977 ఓట్లు రాగా.. చిరంజీవికి 88965 ఓట్లొచ్చాయి. లోకేష్‌పై 5,200 ఓట్ల తేడాతో ఆర్కే గెలుపొందారు. ఈ విజయంతో మంగళగిరి నుంచి రెండోసారి వరుసగా ఆర్కే నెగ్గినట్టయింది. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నారా లోకేశ్ తొలి పరాజయం చవిచూడాల్సి వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -