Wednesday, April 24, 2024
- Advertisement -

జ‌గ‌న్ కు మ‌రోసారి వైద్య ప‌రీక్ష‌లు …

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని సిటీ న్యూరో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. లోట‌స్ పాండ్‌లోకి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న జ‌గ‌న్ ఆరోగ్య ప‌రిస్థితిని ప‌రిశీలించారు. భుజానికి తగిలిన గాయానికి డ్రెస్సింగ్ చేశారు. జగన్ గాయం నుంచి కోలుకుంటున్నారని డాక్టర్ శివారెడ్డి తెలిపారు. బీపీ కంట్రోల్‌లో ఉందని.. గాయం పూర్తి స్థాయిలో మానిపోవడానికి మరో ఆరు వారాల సమయం పడుతోందంటున్నారు.

నొప్పి ఇంకా తగ్గకపోవడంతో జగన్ కు యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నట్లు డాక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు. త్వరలోనే మళ్లీ ఆయన ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొననున్న నేపథ్యంలో చేతికి ఎక్కువ శ్రమ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు.

చర్మంపై వేసిన కుట్లు సాధారణంగా వారంలోనే మానిపోతాయనీ, అయితే కండరాలకు వేసిన కుట్లు మానడానికి మరికొంత సమయం పడుతున్నారు. జగన్ విషయంలో గాయం పూర్తిగా మానడానికి మరో 45 రోజులు పట్టే అవకాశముందని స్పష్టం చేశారు. మరోవైపు జగన్ పై దాడి చేసిన కత్తికి సంబంధించి టాక్సికాలజీ రిపోర్ట్ లో అల్యూమినియం వాడినట్టు నివేదిక వచ్చిందన్నారు డాక్టర్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -