Friday, April 19, 2024
- Advertisement -

థ్యాంక్ గాడ్.. చిరంజీవిని దేవుడే కాపాడాడు..

- Advertisement -

ముంబైలో పని ముగించుకొని హైదరాబాద్ వస్తున్న చిరంజీవికి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. బతుకుజీవుడా అంటూ చిరంజీవి బయటపడ్డారు. లేకపోతే టాలీవుడ్ ఎంతో దుర్వార్త వినాల్సి వచ్చేది.

ముంబైలో పని ముగించుకొని హైదరాబాద్ కు చిరంజీవి బయలు దేరారు. ముంబై లో విస్తారా ఎయిర్ లైన్స్ విమానం ఎక్కారు. అయితే ఆ విమానం టేకాఫ్ అయిన అరగంటకే సాంకేతిలోపం తలెత్తింది. దీన్ని గుర్తించిన పైలెట్ అప్రమత్తమయ్యారు. వెంటనే వెనక్కి తిప్పి విమానాన్ని ముంబై ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చాడు. అత్యవసర ల్యాండింగ్ చేశారు.

విస్తారా ఎయిర్ లైన్స్ లో ఆ సమయంలో చిరంజీవితోపాటు మొత్తం 120 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏదైనా జరిగితే వీరి ప్రాణాలకు ముప్పు వాటిల్లి ఉండేది. విమానంలో సాంకేతిక కారణంతోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు విమానయాన శాఖ అధికారులు తెలిపారు. పైలెట్ వెంటనే సమస్యను గుర్తించడంతో భారీ ప్రమాదం తప్పిందని వివరించారు.

కాగా ముంబై విమానాశ్రయంలో ప్రయాణికులను విస్తారా ఎయిర్ లైన్స్ దించేసింది. దీంతో వారంతా పడిగాపులు కాయగా.. తర్వాత మరో విమానం ఏర్పాటు చేసి అధికారులు వీరిని హైదరాబాద్ పంపారు.

చిరంజీవి కూడా విమానంలో ఉండడంతో ఓ ప్రయాణికులు దీన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -