Thursday, March 28, 2024
- Advertisement -

కాళేశ్వరంలో MEIL కలికితురాయి “మల్లన్న సాగర్”

- Advertisement -

గలగలపారే గోదారమ్మ జలాలు తెలంగాణ పల్లెల్ని శశ్యశ్యామలం చేస్తున్నాయి. కోనసీమ అందాలు తలపించేలా తెలంగాణ పొలం గట్లన్నీ ఇప్పటికే పచ్చదనం పరుచుకున్నాయి.

తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చాలనుకున్న కల, లక్ష్యం వైపు మరో అద్భుతమైన అడుగు ముందుకు పడింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో (KLIP) కీలక ఘట్టమైన “కొమురవెల్లి మల్లన్న సాగర్ పంప్ హౌస్” నుంచి నీటి విడుదల చేసారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) మల్లన్నసాగర్ మరియు కొండపోచమ్మ రెండు ముఖ్యమైన జలాశాయాలు నిర్మించింది.

KLIPలో మల్లన్న సాగర్ 52 టిఎంసి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన అతిపెద్ద మానవ నిర్మిత జలాశయంగా ప్రపంచ రికార్డులు సొంతం చేసుకుంది. మల్లన్న సాగర్ పంప్ హౌజులో మేఘా ఘట్టం మెషిన్లను “స్విచ్ ఆన్” చేసి ప్రారంభించారు. ఈ మల్లన్న సాగర్ నిర్మాణంలో 8మెషిన్లను మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఏర్పాటు చేసింది.

మంగళవారం నాడు జలాశయంలోని గంగమ్మ పరవళ్లు తొక్కుతూ తెల్లని పాల పొంగులా పల్లానికి జాలువారుతూ పరుగులు ప్రారంభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మార్గదర్శకత్వంలో ప్రపంచ రికార్డులు సృష్టిస్తూ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పనులు MEIL పూర్తి చేసింది.

ఈ నిర్మాణంలో ఒక్కో మెషిన్ సామర్ధ్యం 43 మేఘా వాట్లతో 8 మెషిన్లు ఉండగా, ఈ పంప్ హౌజులో మెషిన్లు వినియోగించేందుకు 400 మేఘా వాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. ముందుగా అనుకున్న విధంగానైతే మల్లన్నసాగర్ రిజర్వాయర్ నీటిని నింపిన తర్వాతే కొండపోచమ్మ జలాశయానికి విడుదల చేయాలి. కానీ 52 టిఎంసి సామర్థ్యం గల మల్లన్నసాగర్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో రంగనాయక సాగర్ నుంచి టన్నెల్ ద్వారా తుక్కాపూర్ వద్ద నిర్మించిన సర్జిపూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అక్కడి నుంచి మల్లన్న సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్ వద్ద నుంచి గజ్వేల్ మండలం అక్కారం వద్ద నిర్మించిన పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి మళ్లించారు. ఆ తర్వాత కొండపొచమ్మ సాగర్ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎత్తి పోయనున్నారు.

కాళేశ్వరంలో అత్యధిక ఆయకట్టు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) నిర్మించిన ఈ మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిధిలోనే ఉండటం విశేషం. తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల పరిధిలో లక్షల ఎకరాల పొలాలకు సాగునీరు, అలాగే హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి సౌలభ్యం లభించనుంది. ఈ జలాశయం నుంచే బస్వాపూర్, మముత్ రిజర్వాయర్, సింగూర్ జలాశయానికి నీరు చేరుకుంటుంది. మొత్తం మల్లన్న సాగర్ పంప్ హౌస్ నీటి సామర్థ్యం 248.500 క్యూమెక్స్, కొండపోచమ్మ వెళ్లే దారిలో ఉన్న అన్ని ట్యాంకులు కూడా గోదావరి నీటితో నిండిపోతాయి.

మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) మొత్తం 63 మెషిన్ల తో 3767 మెగావాట్ల సామర్థ్యంతో పంప్ హౌస్‌లను ఏర్పాటు చేసింది. అందులో 49 యంత్రాలు నిరంతరం నీటిని పంపింగ్ చేస్తాయి, మరో 14 యంత్రాల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నిరంతరాయంగా నీటి పంపింగ్‌ కోసం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతేకాకుండా ప్రపంచంలోని అతిపెద్ద భూగర్భ గాయత్రి పంప్ హౌస్‌ను 139 మెగావాట్ల సామర్థ్యంతో ఎనిమిది మెషిన్లను నిర్మించిన ఘనత కూడా MEIL ఖాతాలోనిదే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -