Friday, April 19, 2024
- Advertisement -

ఇంధన రంగంలో అసోం అద్భుతం

- Advertisement -

దేశ, విదేశాల్లో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను విజయవంతంగా చేపట్టి పూర్తి చేస్తున్న మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌) సంస్థ తాజాగా దేశ ఇంధన రంగంలో మరుపురాని విజయాన్ని సొంతం చేసుకొని దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసింది. హైడ్రోకార్బన్స్ రంగంలోకి దిగి భారత దేశ ఇంధన అవసరాలు తీర్చగల దేశంలోనే అతిపెద్ద చమురు, ఇంధన వాయువు సేకరణ, నిల్వ, రవాణా వ్యవస్థ అసోం రెన్యూవల్‌ ప్రాజెక్ట్‌ (ఏఆర్‌పి)ను మేఘా సంస్థ అధునాతన పద్ధతిలో పునర్నిర్మించి విజయపతాక ఎగురవేసింది. కొత్త సంవత్సరం వేళ దేశానికి, మేఘా సంస్థకు మరుపురాని విజయం దక్కింది.

ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా
దేశీయంగా ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించానే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అములోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా చేపట్టిన చమురు, సహజవాయు క్షేత్రాల వెలికితీత పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ హైడ్రోకార్బన్స్‌ విభాగంలో ఇప్పటికే దేశ, విదేశాల్లో అనేక ప్రాజెక్టులను చేపట్టి, విజయవంతంగా పూర్తిచేసింది. తాజాగా దేశంలోనే అతిపెద్దది అయిన అసోం రాష్ట్రంలో ఓఎన్ జేసీకి ప్రతిష్టాత్మకమైన ‘‘ఆన్‌షోర్‌ చమురు, ఇంధన వాయువు సేకరణ, నిల్వ, రవాణా వ్యవస్థ అసోం రెన్యూవల్‌ ప్రాజెక్ట్‌ (ఏఆర్‌పి)’’ ప్రాజెక్టును మేఘా చేపట్టింది. మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వ్యవస్థ, ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా లేకపోవడంతో రూ. 2400 కోట్ల అంచనా వ్యయంతో ఆధునీకరణ పద్ధతిలో పునర్‌ నిర్మించారు. ఈ పనిని ఈపీసీ పద్ధతిలో దక్కించుకున్న మేఘా సంస్థ (ఎంఇఐఎల్‌) తాజాగా అసోం రాష్ట్రంలోని లఖ్వా గ్రూప్‌ గ్యాదరింగ్‌ స్టేషన్‌ (జీజీఎస్‌)ను పూర్తిచేసి జాతికి అంకింతం చేయడం ద్వారా దేశానికి గొప్ప బహుమతిని అందించింది.

దిగుమతి అవసరాలు తగ్గుముఖం ..
అసోంలోని అన్ షోర్ వ్యవస్థలో గతంలో క్లిష్టమైన నిర్మాణాలు, సుదూరమైన పైపులైన్లు ఉండగా వాటి సంఖ్యను, దూరాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రిమోట్‌ తరహాలో పనిచేయించడం ద్వారా వ్యయా ప్రయాసాలను, భారాలను ఓఎన్‌జీసీ-ఎంఇఐఎల్‌ తగ్గించాయి. ఓఎన్‌జీసీ చేపట్టిన భూ ఉపరితల (ఆన్‌షోర్‌) ప్రాజెక్ట్‌ల్లో దేశంలో ఇదే పెద్దది కావడంతో ఈ ప్రాజెక్ట్‌ను ఆ సంస్థ ప్రతిష్టాత్మకమైనదిగా పరిగణిస్తోంది. దేశీయ చమురు ఇంధన రంగంలో కీలకభూమికను నిర్వహించే ఈ వ్యవస్థ అధునాతన పద్ధతిలో పునర్‌నిర్మించడం ద్వారా విదేశీ చమురును దిగుమతిచేసుకునే అవసరాలు కూడా తగ్గముఖం పడతాయి. మూడు దశాబ్ధాల క్రితం అసోంలో ఓఎన్జీసీ ఏర్పాటు చేసిన చమురు, ఇంధన వాయు నిల్వ, రవాణా వ్యవస్థ పాతబడిపోయింది. ఇంధన ఉత్పత్తి శుద్ధి సామర్థ్యం తగ్గిపోయింది. దీంతో ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కాలం చెల్లిన నిర్మాణాలను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించేందుకు ఓఎన్‌జీసీ అసోం రెన్యూవల్‌ ప్రాజెక్ట్‌ను (ఏఆర్‌పి) చేపట్టింది.

కాలుష్యాన్ని నిరోధించడంలో…
ఏఆర్పీ పనులను దక్కించుకున్న మేఘా సంస్థ శరవేగంగా ఈ పనులు ప్రారంభించించింది. ప్రధానంగా వెల్‌ ఫ్లూయిడ్‌ లింక్‌తో పాటు చమురు, గ్యాస్‌ సరఫరా అయ్యే పైపులైన్లను, గ్యాస్‌ లిఫ్ట్‌ లైన్లు, వ్యవస్థను సమర్థంగా పనిచేసేందుకు ఉపయోగపడే వాటర్‌ ఇంజెక్షన్‌ లైన్లను నిర్మించింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడం ద్వారా కార్బన్‌ ఉద్ఘారాలను తగ్గించి వాతావరణ కాలుష్యాన్ని నిరోధించడంలో ఈ ప్రాజెక్ట్‌ కీలకభూమికను నిర్వహించనుంది. ఇందుకు అవసరమైన పైపులు, వివిధ యంత్రల పరికరాలను ఎంఇఐఎల్‌ సొంతంగా ఉత్పత్తి చేసింది. సంస్థకు చెందిన జీడిమెట్లలోని కర్మాగారం నుంచి వీటిని తయారుచేసి నేరుగా అసొంకు సరఫరా చేసి అక్కడ నిర్మాణంలో ఉపయోగించారు.

అసోం రెన్యూవల్‌ ప్రాజెక్ట్‌ ఆధునీకరణ వల్ల ముడి చమురు ఇంధన ప్రాసెసింగ్‌ సామర్థ్యం గణనీయంగా పెరుగుతోంది. ఇప్పుడు రోజుకు క్రూడాయిల్‌ ప్రాసెసింగ్‌ 10,000 ఘణపు మీటర్లు, శుద్ధి సామర్థ్యం 12,000 ఘణపు మీటర్లు, వాటర్‌ ఇంజెక్షన్‌ సామర్థ్యం 5,300 ఘణపు మీటర్లు సాధ్యమవుతుంది. అదే విధంగా ఖనిజ వాయువు ఎల్డీ కంప్రెషర్‌ ప్రాసెసింగ్‌ మూడు రకాలుగా ఉంటుంది. తక్కువ, మధ్య, అధిక రకాలు ఉంటాయి. అవి వరుసగా 16 లక్షల ఘణపు మీటర్లు, 10 లక్షల ఘణపు మీటర్లు, 15 లక్షల ఘణపు మీటర్ల చొప్పున ప్రతీరోజూ కంప్రెస్‌ చేస్తారు. సెంట్రల్‌ ట్యాంక్‌ సామర్థ్యం 50 వేల ఘనపు మీటర్లు. ఇలా ఎన్నో అత్యాధునిక సాంకేతికను పెంచేలా మేఘా సామర్థ్యాన్ని పెంచి నిర్మాణాలు చేపట్టింది. ఇలా దేశానికి ప్రధానమైన ఇంధన వనరుల విషయంలో ప్రాజెక్టులు చేపట్టి మేఘా మరోసారి మౌళిక సదుపాయాల సంస్థల్లో తిరుగులేని రికార్డును సొంతం చేసుకొంది. అనతికాలంలోనే పూర్తి చేసి దేశ ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -