Friday, March 29, 2024
- Advertisement -

‘మేఘా’ థర్మల్వెలుగులు

- Advertisement -

జాతీయ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా రంగంలో చెరగని ముద్రను వేసుకున్న ఎంఇఐఎల్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలోను దిగ్విజయంగా ప్రస్థానాన్ని ప్రారంభించింది. జల, సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఎంఇఐఎల్ తమిళనాడు రాష్ట్రంలో రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్మించింది. ముందుగా నాగపట్నం జిల్లాలో నాగాయ్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభానికి సిద్ధం చేసింది. అలాగే ట్యూటికోరిన్ జిల్లాలో ఎస్ఇపిసి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ థర్మల్ విద్యుత్ కేంద్రం 525 మెగావాట్ల బొగ్గు ఆధారితమైన ప్రాజెక్టు నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసింది.

నాగాయ్ లో 150 మెగావాట్లతో…
నాగాయ్ థర్మల్ పవర్ ప్రాజెక్టు వివరాల్లోకి వెళ్తే 150 మెగావాట్లతో నిర్మిస్తుండగా ప్రస్తుతం 60 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సౌలభ్యంతో గ్రిడ్కు అనుసంధానం చేశారు. తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో నిర్మిస్తోన్న ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం ఈపిసి పద్ధతిలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్), కెవికె ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ వెంచరుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును ఈ నెలలో ప్రారంభించడానికి సిద్ధం చేసింది. నాగపట్నంకు 15 కిలో మీటర్ల దూరంలోన్న ఈ ధర్మల్ ప్లాంటు రాకపోకలకు రోడ్డు, రైలు, విమాన మార్గాలతో పాటు సముద్ర మార్గం కూడా ఉంది. 230 ఏకరాల్లో 530 టిపిహెచ్ సామర్థ్యంతో బాయలర్ లుండగా, ఎంఇఐఎల్ 150 మెగావాట్ల టర్బైన్ జనరేటర్, 125 మీటర్ల చిమ్నీ (పొగ గొట్టం) అలాగే ఏయిర్ కూల్డ్ కండెన్సర్ ఏర్పాటు చేసింది. ఇందులో బిహెచ్ఇఎల్ బాయిలర్లను తయారు చేసింది. ఈ ప్లాంటులో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కోసం 70శాతం బొగ్గును దేశీయంగా సమీకరిస్తుండగా, 30శాతం విదేశాల నుండి దిగుమతి చేసుకోనున్నారు. ఉత్పత్తి అయిన విద్యుత్ ను తరలించేందుకు 24.6 కిలో మీటర్ల ట్రాన్స్ మిషన్ లైన్లను 230కెవి తిరువూరు సబ్ స్టేషన్ వరకు ఎంఇఐఎల్ నిర్మించగా, 3700 టన్నుల స్టీల్ను కూడా సొంతంగా సరఫరా చేసి అమర్చింది. 7 రోజులకు సరిపడా బొగ్గును నిల్వ చేయడానికి 114 టిపిహెచ్ నిల్వ సామర్థ్యం ఉండగా ఇప్పటికే దాదాపు 130 మెగావాట్లకు ప్రైవేట్ ఏజెన్సీలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పూర్తయ్యాయి. జూలై 10. 2019 నాడు కమీషనింగ్ అవడంతో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.

525 మెగావాట్ల విద్యుత్ కేంద్రం
ట్యూటికోరిన్ జిల్లాలో 525 మెగావాట్ల సామర్ధ్యం గల బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రం. ఆర్థిక, సాంకేతిక అంశాల అధారిత అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్కు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అర్హత సాధించి ఇపిసి పద్దతిలో కాంట్రాక్టును సొంతం చేసుకుంది. ఎస్ఇపిసి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ బొగ్గు ఆధారిత ట్యూటికోరిన్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్కు సంబంధించి తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పోరేషన్ లిమిటెడ్ తో ఎస్ఇపిసి సంస్థ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకున్నది. ఈ విద్యుత్ కేంద్రం కోసం వి.ఓ.చిదంబరం పోర్ట్ నుంచి స్థలాన్ని లీజుకు తీసుకుని కోల్ జెట్టీ, కన్వేయర్, కూలింగ్ వాటర్ సిస్టమ్, 500 టిపిహెచ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, గంటకు 6700 క్యూమెక్స్ సముద్ర జలాల ఇంటెక్, గంటకు 66000 క్యూమెక్స్ సామర్థ్యంతో కూలింగ్ వాటర్ సిస్టమ్, 15000 టన్నులు స్టీల్, 10 కిలో మీటర్ల సిబ్ల్యు పైప్ లైన్ ఏర్పాటు చేస్తోంది. 275మీటర్ల ఎత్తయిన చిమ్నీ (పొగ గొట్టం)ను ఏర్పాటు చేశారు. బిహెచ్ఇఎల్ ఈ థర్మల్ ప్లాంటులో 1700 టిపిహెచ్ సామర్థ్యంతో బాయలర్, 555 మెగావాట్ల సామర్థ్యంతో టర్భైన్ జనరేటర్ లను తయారు చేసింది. అలాగే వడక్కు కరసేరి గ్రామంలో బూడిద చెరువు (యాష్ పాండ్) ను ఏర్పాటుకు 100 హెక్టార్ల స్థలాన్ని సేకరించగా, తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (టాన్జెడ్కో) ఎంఇఐఎల్ కు 48 కిలో మీటర్ల 400 కెవి ట్రాన్సమిషన్ లైన్లను ఏర్పాటు చేసే పనులను అప్పగించింది. ఇప్పటికే ఎస్ఇపిసి టిఎన్ఈబీ తో విద్యుత్ అమ్మకాల కోసం 30 సంవత్సరాలకు ఒప్పందాలు, బొగ్గును సరఫరా చేసేందుకు గాను దేశీయ మరియు విదేశీ సంస్థలతో చేసుకుంది. 2018 డిసెంబర్ 28న బాయిలర్ హైడ్రో టెస్ట్ విజయవంతంగా చేయడంతో పాటు 90% పనులు పూర్తయ్యాయి. త్వరలో ఎంఇఐఎల్ ఎలక్ట్రో మెకానికల్ పనులు ముగించి విద్యుత్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

దేశాభివృద్ధిలో కీలకమైన విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో ఎంఇఐఎల్ ఇప్పటికే నాలుగు సౌర విద్యుత్ కేంద్రాల్లో 112 మెగావాట్ల సౌర విద్యుత్ ను అందుబాటులో ఉంచింది. గుజరాత్ లోని వడోదర బ్రాంచ్ కెనాల్ పై 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాన్ని సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ కోసం ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు వడోదర బ్రాంచ్ కెనాల్ పై 26 కిలో మీటర్ల నుంచి 37 కిలో మీటర్ల మధ్య 5.5 కిలో మీటర్ల వరకు ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ కన్సల్టెన్సీ కంపెనీ KPMG ఎకానమీ పవర్ ప్రాజెక్టుల నివేదికలో వంద సృజనాత్మక ఇన్ఫ్రాస్ట్రక్టర్ ఆవిష్కరణల్లో నర్మదా కెనాల్ సోలార్ ప్రాజెక్టును రికార్డుల్లోకి ఎక్కింది. మన దేశం నుంచి ఎంపికైన ఆరింటిలో ఎంఇఐఎల్ నిర్మించిన సోలార్ ప్లాంటే అగ్రగామి కావడం విశేషం.

మహారాష్ట్రలో ఫొటో వోల్టిక్ టెక్నాలజీతో రెండు సోలార్ విద్యుత్ కేంద్రాలను మహా జెన్కో కోసం ఎంఇఐఎల్ నిర్మించింది. ఇందులో రెండు మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ను 2014-15 మధ్యలో చంద్రాపూరులో ఏర్పాటు చేయగా, ధూలే జిల్లా సాక్రి వద్ద 50 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం నాగలాపూరం వద్ద 50 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసింది. ఎంఇఐఎల్ సొంతంగా బిల్ట్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ ఫర్ (బీఓఓటీ) పద్ధతిలో నిర్మించింది. జల విద్యుత్ ఉత్పత్తి రంగం విషయానికి వస్తే హిమాచల్ ప్రదేశ్ లో ఎంఇఐఎల్ 25 మెగావాట్ల లాంబడ్గ్ జల విద్యుత్ కేంద్రం సొంతంగా నిర్మిస్తోంది. గుజరాత్ లోని సౌరాష్ట్ర బ్రాంచ్ కెనాల్ పై 45 మెగావాట్ల సామర్థ్యంతో మూడు హైడ్రో పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో రెండు ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. మూడో విద్యుత్ కేంద్రం పనులు పూర్తయ్యాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -