Tuesday, March 19, 2024
- Advertisement -

మేఘా ప్రపంచ రికార్డు… తెలంగాణ మాగాణి మురువంగా

- Advertisement -

ప్రపంచ నీటిపారుదల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మేఘా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు. ఇంతటి భారీ ప్రాజెక్టును చేపట్టి పూర్తి చేయాలంటే రెండు మూడూ దశాబ్దాలు పడుతుందిలే అనేది గతానుభవం, కేవలం మూడు సంవత్సరాల్లోనే ప్రాజెక్టులోనే సింహ భాగాలైన లింక్-1, లింక్-2లను పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దీక్షకు ఎంఈఐఎల్ పట్టుదల తోడవడంతో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. మూడేళ్ల కాలంలోనే 11 పంపింగ్ కేంద్రాల్లో 59 మెషీన్లు, 3436 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేయడమన్నది అనితర సాధ్యం. గతంలో ప్రపంచం కనీ వినీ ఎరుగని రీతిలో ఈ పంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి వినయోగంలోకి తేవడం ఎంఈఐఎల్ నిబద్ధత, పట్టుదలకు తార్కాణం. దీంతో నిర్దేశించిన కాలానికి ముందే రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయాలన్న లక్ష్యం నెరవేరింది.

తెలంగాణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కలను సాకారం చేస్తూ జూన్ 21, 2019న ముఖ్యమంత్రి కేసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. అప్పటి నుంచి వివిధ దశల్లో లక్ష్మి(మేడిగడ్డ), సరస్వతి(అన్నారం), సుందిళ్ల(పార్వతి), గాయత్రి పంపింగ్ కేంద్రాల్లో అన్ని మెషీన్లు వినియోగంలోకి తేవడంలో మేఘా ఇంజనీరింగ్ సఫిలీకృతమైంది. భారీ పంపింగ్ కేంద్రాల్లో అత్యంత శక్తి సామర్ధ్యాలతో కూడిన మెషీన్లును ఏర్పాటు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి భూగర్భంలో 470 అడుగుల దిగువ నుంచి నీటిని ఎత్తిపోయడం అంటే ఆ భారీ మెషీన్ల శక్తి సామార్ధ్యాలేంటో తెలుస్తుంది. ఎంతో క్లిష్టమైన ఎలక్ట్రోమెకానికల్ పనులను విజయవంతంగా పూర్తి చేసి ఇంజనీరింగ్ నైపుణ్యతలో తనేంటో ప్రపంచానికి చాటింది మేఘా ఇంజనీరింగ్ కంపెనీ.

గోదావరి నదికి వరద కాలంలో 90 రోజులకు సుమారు 270 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనుకున్న దిశలోనే సాగడంలో ఎంఈఐఎల్ కృషి మరువలేనిది. కేవలం రెండేళ్ళలోనే 11 పంపింగ్ కేంద్రాలను పూర్తి చేసిన మేఘా, లింక్-1 పూర్తి చేసి 120 కి.మీ ఎగువకు నీటిని చేరవేయడం ఒక రికార్డు. రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి నది దిశను మార్చి ఎగువకు పరవళ్లు తొక్కించడంతో అసాధ్యమనుకున్నదాన్ని ఎంఈఐఎల్ సుసాధ్యం చేసి చూపింది. ఇందులో భాగంగా ఉపనది ప్రాణహిత నీటిని ప్రధాన నది గోదారి ఎగువకు ఉరుకులు పెట్టించడమే అరుదైన విషయం. బీడుబారిన తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధిని, పట్టుదలను ఆచరణలో సాధ్యం చేసిన ఎంఇఐఎల్.

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన తరువాత ప్రధాన ఘట్టానికి తెరలేపింది ఎంఈఐఎల్, లక్ష్మి(మేడిగడ్డ) పంపింగ్ కేంద్రంలో ఫిబ్రవరి 15, 2020 అర్థరాత్రినుంచి ఎకకాలంలో మొత్తం 11 మెషీన్లతో నీటిని ఎత్తిపోయడం ఇదే మొదటి సారి కావడం విశేషం. దీంతో తొలి దశలోని పనులు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. తాజాగా లక్ష్మీ కేంద్రం పిబ్రవరి 15వ తేదీ అర్దరాత్రి నుండి ఇప్పటివరకు నాలుగు టిఎంసిల నీటిని ఎత్తిపోసింది. మొదటి సారి ఆవిష్కృతమైన సుందర జల దృష్యం చూపరులను మైమరిపంపజేసింది. ప్రదాన నదే ఇక్కడి నుంచి ప్రవహిస్తుందా అన్నంతగా నీటిప్రవాహం ఎగువన సరస్వతికి చేరడం అనిర్వచనీయం. దీంతో దక్షిణ తెలంగాణ రైతాంగం ఆనందంలో మునిగిపోయింది.

నీటి పారుదల చరిత్రలో ఇప్పిటివరకు భారి ఎత్తిపోతల ప్రాజెక్టుగా పేరొందింది హంద్రీ-నీవానే. భారీ పంపింగ్ కేంద్రాలతో ఘన చరిత్రను నెలకొల్పింది మేఘా ఇంజనీరింగ్ మాత్రమే. అంతటి ఘన చరిత్రను తోసిరాస్తూ అతి తక్కువ సమయంలోనే అంటే కేవలం మూడు సంవత్సరాల్లోనే ఊహకందని చరిత్రను కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఎంఈఐఎల్ సృష్టించింది. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో హంద్రీ-నీవా ప్రాజెక్ట్ 2007లో ప్రారంభమై (అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో) ఇప్పటికీ ప్రధానమైన నిర్మాణాలన్నీ పూర్తికాగా మరో రెండు పంప్హౌస్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. అంటే పుష్కరకాలం దాటిపోయింది. తెలంగాణలో మాత్రం అంతకన్నా భారీ ప్రాజెక్ట్ను మూడేళ్ళలోపే ప్రభుత్వ పట్టుదల వల్ల ఎంఇఐఎల్ పూర్తిచేయగలిగింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 22 పంపింగ్ కేంద్రాలుండగా అందులో సింహ భాగం అతి ప్రధానమైన 17 పంపింగ్ కేంద్రాలను పూర్తి చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మేఘాకి ఇవ్వడం, అంతే సాంకేతిక నైపుణ్యంతో ఇంజనీరింగ్ దక్షతతో అనుకున్న సమయానికే పంపింగ్ కేంద్రాల నిర్మాణం పూర్తిచేయడం, వినియోగంలోకి తేవడం చక చకా జరిగిపోయాయి. భారీ పంపింగ్ కేంద్రాలలో మెషీన్ల ఏర్పాటుకు ఎంఇఐఎల్ ప్రధానంగా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ పనులు చేయగా అందుకు అవసరమైన పంపింగ్ మిషన్లను బీహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైలం లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంజీనిరింగ్ సంస్థలు సమకూర్చాయి.

కాళేశ్వరం ప్రాజెక్టులో అతి పెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్ నెలకొల్పింది. అది ఎంత పెద్ద వ్యవస్థ అంటే మొత్తం తెలంగాణ విద్యుత్ సరఫరాలో నాలుగోవంతు. అందుకే ప్రభుత్వం రాత్రి సమయంలోనే నీటి పంపింగ్ ప్రక్రియను చేపట్టింది. ఇప్పటి వరకు హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకంలో 43 పంపింగ్ కేంద్రాలల్లోని 269 మిషన్ ద్వారా దాదాపు 653 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపింగ్ వ్యవస్థను మేఘా ఏర్పాటు చేయడమే ప్రపంచంలో అతి పెద్దదిగా రికార్డులకెక్కంది. ఇప్పుడు కాళేశ్వరం మొదటిదశలో 6 రేట్లు ఎక్కువగా అంటే 3436 మెగావాట్ల సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది. ఇందులో 400 కేవీ, 220 కేవీ సామర్థ్యం కలిగిన ఆరు విద్యుత్ సబ్ స్టేషన్లు, దాదాపు 260 కిలోమీటర్ల మేర ట్రాన్స్ మిషన్ లైన్లను ఎంఈఐఎల్ కేవలం రెండేళ్ల కాలంలో పూర్తిచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం 4627 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవసరం కాగా అందులో 3057 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్ అనతికాలంలోనే నిర్మించి చరిత్ర సృష్టించింది.

కాళేశ్వంరం ప్రాజెక్టులో మొత్తం 11 పంపింగ్ కేంద్రాలు, 59 మెషీన్లను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం 7200 మెగావాట్ల సామర్ధ్యంతో రోజుకు 3 టిఎంసీల నీటిని పంప్ చేసే లక్ష్యంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతానికి రోజుకు రెండు టిఎంసిల నీటిని ఎత్తపోసేందుకు 4992 మెగావాట్ల సామర్ధ్యంగల విద్యుత్ వ్యవస్థ అవసరం కాగా అందులో అత్యధిక భాగం మేఘానే పూర్తి చేసింది. 11 పంపింగ్ కేంద్రాల్లో 59 మిషన్లను ఏర్పాటు చేయడం ద్వారా 3436 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థతను రెండున్నరేళ్ళ కాలంలో నిర్మించడం మరో ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. కాళేశ్వరం మొదటి దశలోని లక్ష్మి, సరస్వతి, పార్వతి, గాయత్రి పంపింగ్ కేంద్రాలను పూర్తిగా వినియోగంలోకి తేవడంతో ఇప్పటి వరకు 50 టిఎంసీల నీటిని మిడ్ మానేరుకు తరలించి అక్కడి నుంచి కొంత నీటిని లోయర్ మానేరుకు తరలించడంతో దాదాపుగా 160 కి.మీ. మేర నీరు పరిచనట్లుగా ఉంది. ఈ ప్రాంతంలో భూగర్భ జలమట్టాలు ఘననీయంగా పెరగడంతో కాళేశ్వరం ఫలితాలు ప్రారంభమయ్యాయి. తాజాగా లక్ష్మీ కేంద్రం నుంచి 11 మిషన్లతో పంపింగ్ ప్రారంభించగా సరస్వతి, పార్వతి కేంద్రాల నుంచి కూడా పూర్తిస్థాయిలో పంపింగ్కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే సరస్వతిలో 4 మిషన్లు పంపింగ్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో మిగతా నీటిని కూడా ఎల్లంపల్లి,మిడ్ మానేరుకు తరలించి వచ్చే వానకాలానికల్లా లక్ష్మి,సరస్వతి,పార్వతిలలో నీటిని తోడేసి కొత్త నీటిని పంపింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన.

కాళేశ్వరం ప్రాజెక్ట్లోని ప్యాకేజ్-21,27,28ల తోపాటు కొండపోచమ్మ, మల్లన్నసాగర్ పంపింగ్ కేంద్రాల్లో మెషీన్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ కేంద్రాల నుంచి నీటిని పంప్చేయడం ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే లక్ష్మీ పంపింగ్ కేంద్రంలో 11 మిషన్లు, సరస్వతి కేంద్రంలో 8, పార్వతి కేంద్రంలో 9 మిషన్లు చొప్పున ఒక్కొక్క మెషీన్ 40 మెగావాట్ల సామర్ధ్యంతో వినియోగంలోకి వచ్చాయి. ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో భూగర్భలో 447 అడుగుల దిగువన నిర్మించిన గాయత్రి అతిపెద్ద పంపింగ్ కేంద్రంలో 973 మెగావాట్ల సామర్థ్యంతో మిషన్లు పూర్తిగా నీటిని ఎత్తిపోస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్లోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్ పంపింగ్ కేంద్రాల్లో మొత్తం 8 మిషన్లకు గాను ఇప్పటికే 5 పూర్తయ్యాయి. మరో మూడు నిర్మాణ దశలో ఉన్నాయి. మిడ్మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు నీటిని రోజుకు రెండు టిఎంసీల చొప్పున తరలించేందుకు అవసరమైన పనులు చురుగ్గా జరుగుతున్నాయి.

మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతి కీలకమైనది గాయత్రి పంపింగ్ కేంద్రం.ఎందుకంటే అతి భారీ మెషీన్లతో భారీ పంపింగ్ సామర్ధ్యంతో భూగర్భంలోంచి 447 అడుగుల లోతు నుంచి నీటిని ఎత్తిపోయడం ఆధునీక ప్రంపంచపు వింత. ఈ సీజన్ లో ఇప్పటి వరకు మేఘా పంపింగ్ కేంద్రాలు 44 టీఎంసిల నీటిని ఎత్తిపోశాయి. ప్రాజెక్టులోని మిగతా ప్యాకేజిలు త్వరిత గతిన పూర్తి చేసి బంగారు తెలంగాణను సస్యశ్యామల తెలంగాణ మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని భుజాన వేసుకొని ముందుకు సాగుతుంది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -