మంత్రి జయరాం జైలుకి వెళ్లక తప్పదా..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ఏరులై పారుతుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ని జగన్ ఇప్పటికే వెలికి తీసే ప్రయత్నంలో జగన్ ఉన్నారు.. ఆ క్రమంలోనే కొంతమంది ఎలుకల్ని జైలుకి పంపాడు.. వారు కూడా అవినీతి ఆరోపణల్లో నిజం నిర్ధారణ అవడంతో సైలెంట్ గా ఉండక తప్పట్లేదు.. ప్రతిపక్ష పార్టీ లో అవినీతికి పాల్పడ్డ వారిపై జులుం విప్పుతూ వారిని జైలుకి పంపిస్తూ ప్రజలకు అవినీతి లేని సామ్రాజ్యాన్ని సృష్టించే పనిలో ఉన్న జగన్ కు సొంత పార్టీ నేత అవినీతి కోరల్లో చిక్కుకోవడం ఇప్పుడు సమస్యగా మారింది.. అయితే ఇప్పటివరకు ఇవి ఆరోపణలే అయినా రుజువైతే ఏంటి పరిస్థితి అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

జగన్ ఆ నేత ను ప్రతిపక్ష నేతలను పంపినట్లు జైలుకి పంపుతాడా.. చంద్రబాబు చేసినట్లు వెనుకోసుకొస్తారా అన్నది చూడాల్సి వుంది.. తాజాగా కర్నూలు జిల్లా ఆస్పరిలో మంత్రి కుటుంబసభ్యులు కొనుగోలు చేసిన వందల ఎకరాల భూముల వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసే దిసగా మార్చేస్తున్నారు. ఇట్టినా కంపెనీ తనకు భూముల్ని అమ్మింది నిజమేనని.. కానీ ఇప్పుడు అమ్మలేదంటున్నారని.. మంత్రి సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు విషయం ఏమిటటంటే.. మంజునాథ్ అనే వ్యక్తి దగ్గర మంత్రి జయరాం కుటుంబసభ్యులు ఆ భూములు కొనుగోలు చేశారు.

- Advertisement -

ఈ మంజునాత్ ఒకప్పుడు ఇట్టినా ప్లాంటేషన్ కంపెనీలో ఉన్నారు. ఆ తర్వాత విరమించుకున్నారు. అయితే.. ఆయన ఇట్టినా ప్లాంటేషన్ బోర్డు.. తనకు ఆ భూముల్ని అమ్మే పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిందంటూ ఓ పత్రం తీసుకు వచ్చి.. ఆ కంపెనీకి చెందిన భూముల్ని మంత్రి కుటుంబసభ్యుల పేరు మీద రిజిస్టర్ చేసేశారు. మంత్రిగారే కొనుక్కుంటున్నారు కాబట్టి.. ముందూ వెనుకా ఆలోచించకుండా… అధికారులు రిజిస్టర్ చేసేశారు. అయితే ఇప్పుడు ఆయన భూములు కొన్న వ్యవహారం బయటకు రావడంతో .. మొత్తం మ్యాటర్ అంతా రివర్స్ అయింది. ఇందులో భారీ కుంభకోణం జరిగిందని అంటున్నారు.. దీనికి కౌంటర్ ఇవ్వడానికి జయరాం తంటాలు పడుతున్నారు. నకిలీ డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేశారా, లేదా బెదిరించి భూముల్ని సొంతం చేసుకున్నారా అనేది దర్యాప్తు లో తేలనుంది..

Most Popular

జగన్ లేఖ రాస్తే తప్పేముంది.. ఎందుకింత సీన్..?

జగన్ రావడం కాస్త ఆలస్యమైనా రావడం రావడమే కుంభస్థలం కొట్టారు.. ఏపీలో దాదాపు అని నియోజక వర్గాల్లో వైసీపీ తన సత్తా చాటింది.. చాటడమే కాదు మళ్ళీ ముందు ముందు...

వెంకటేష్ కూతురు ఈ అమ్మాయి ఇప్పుడేం చేస్తుందంటే ?

నల్లవం అనే మలయాళం సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైనది మలయాళం కుట్టి ఎస్తర్ అనిల్. దర్శకురాలు శ్రీప్రియ దర్శకత్వం వహించిన “దృశ్యం” అనే చిత్రంలో వెంకటేష్ కూతురు...

హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

హీరోయిన్ రీమా సేన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో నటించిన రీమా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. రమ్యకృష్ణ తర్వాత విలన్ రోల్ లో కూడా ఎంతో...

Related Articles

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలంటే చంద్రబాబు తర్వాత ఎవరైనా. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేస్తూ వచ్చింది కూడా ఇదే. చంద్రబాబు వ్యవస్థను బాగా మేనేజ్ చేస్తారని మొదటి...

వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర

ప్రజారోగ్యాన్ని అందించాల్సిన ఆరోగ్య విభాగానికి అవినీతి జబ్బు చేసింది. కొందరు అధికారుల భాగోతాలు "అవినీతి రహిత పాలన " అంటున్న ముఖ్యమంత్రి కి తలవంపులు తెస్తున్నాయి. కోట్ల మంది ప్రజల...

వైఎస్సార్ ని మించి పోయిన జగన్.. పాలన భేష్..?

రాష్ట్రంలో జగన్ ఎంతో సమర్దవంతం గా పాలన అందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. మూడు రాజధానుల విషయంలో ఆయన చూపిస్తున్న దార్శనికత కి ప్రతి ఒక్కరు సమర్దిస్తున్నారు.. అన్ని ప్రాంతాలు...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...