Thursday, April 25, 2024
- Advertisement -

ఒక్క నిమిషానికి ముఖేష్ అంబానీ ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో తెలుసా..?

- Advertisement -

మనందేశంలో అతధిక సంపాదన కలిగిన వ్యక్తి ఎవరంటే ఎవరైనా ముఖేష్ అంబానీ గుర్తహిస్తారు.. అయన అంత సంపాదిస్తున్నారు.. ఇంత సంపాదిస్తున్నారు అనడం తప్పితే కరెక్ట్ గా ఎంత సంపాదిస్తున్నారో ఎవరికీ తెలీదు.. నిజానికి ఆయనకు కూడా తెలీదనుకుంటా.. దేశంలో గుండు పిన్ను దగ్గరినుంచి తయారయ్యే వస్తువులలో అంబానీ ప్రోడక్ట్ తపాకుండా ఉంటుంది అనేది మాత్రం అందరికి తెలుసు.. ఇటీవలే ఫోర్బ్స్ జాబితా లో కూడా అయన చోటు సంపాదించుకున్నారు..

అయన సంపాదన గంటకు అక్షరాలా తొంబై కోట్ల రూపాయలు. అంటే నిమిషానికి కోటిన్నర. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 తాజాగా విడుదల కాగా, వరుసగా తొమ్మిదో సంవత్సరమూ ఆయన తొలి స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ముఖేష్ ఆస్తుల విలువ గత సంవత్సరంతో పోలిస్తే, రూ.2.77 లక్షల కోట్ల నుంచి, రూ.6.58 లక్షల కోట్లకు పెరిగింది.

ఇటీవలి కాలంలో రిలయన్స్ అనుబంధ జియో ప్లాట్ ఫామ్స్ తదితర కంపెనీల్లోకి భారీ ఎత్తున ఇన్వెస్ట్ మెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆస్తుల విలువ కూడా గణనీయంగా పెరిగిపోయింది. ఇక, తమ అధ్యయనంలో భాగంగా ఐఐఎల్ఎఫ్, ఇండియాలో రూ. 1000 కోట్లకు మించి సంపదను కలిగివున్న 828 మంది ఆస్తులను పరిశీలించింది. వారిలో 627 మంది ఆస్తులు గడచిన ఏడాది వ్యవధిలో పెరిగాయని, 229 మంది సంపద మాత్రం తగ్గిందని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -