Saturday, April 20, 2024
- Advertisement -

మారుతీరావు కలలో కూడా ఊహించని మద్దతు ఎందుకంటే ?

- Advertisement -

మిర్యాలగూడ హత్య కేసులో అమృతను ఆదుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇవ్వడం పెద్ద ఎ్తతున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమృతకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటనపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ప్రణయ్, అమృత ఏం సాధించారని అండగా ఉంటారో చెప్పాలని నిలదీస్తున్నారు. 23 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినందుకా అండగా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. అమృత భద్రత కోసం పోలీసులను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఏమైనా జాతీయ నాయకురాలా ? ప్రజా ఉద్యమకారిణా ? ఎందుకు పోలీస్ భద్రతో చెప్పాలని నిలదీస్తున్నారు. పైగా ప్రభుత్వం తరఫున 8లక్షల 25 వేలు సాయం, వ్యవసాయ భూమి, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని మంత్రి చెప్పడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము. ప్రజల కష్టార్జితంతో కట్టిన పన్నుల సొమ్మును ఇలా ఎవరికి పడితే వాళ్లకు ధారపోయడానికా మీకు అధికారం ఇచ్చింది ? అని అనేక వర్గాల ప్రజలు యూ ట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా మండిపడుతున్నారు. జగదీశ్వరరెడ్డితో పాటు అమృతను పరామర్శించి, ఆదుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం. అని హామీలు ఇచ్చిన జానారెడ్డి, ఉత్తమ్ భార్య పద్మారెడ్డి సహా నేతలందరినీ ఉతికి ఆరేస్తున్నారు. ప్రణయ్ విగ్రహం ఏర్పాటుతో భావితరాలకు ఏం మెసేజ్ ఇస్తారని నిలదీశారు.

ఓ మనిషిని తోటి మనిషి హత్య చేయడం బాధాకరమే. కానీ ఆ హత్యకు పాల్పడ్డారంటే వారి మానసిక పరిస్థితి, పడిన ఇబ్బందులు, పిల్లల మీద ప్రేమ, కుటుంబం, ఇతర సమస్యలను అర్ధం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకానీ కులం, ప్రేమ అంటూ తరతరాలుగా తల్లిదండ్రుల మానసిక క్షోభను అర్ధం చేసుకోకపోతే ఎలా ? అని నిలదీస్తున్నారు. 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లిదండ్రుల ప్రేమను మించిన ప్రేమ ఇంకేం ఉండదని జనం అంటున్నారు. ఏడాదో ? ఆరు నెలలో వెంట పడేవాడితో వెళ్లిపోయి, తల్లిదండ్రుల గుండెల్లో గునపాలు దించే వాళ్లను ఎలా ప్రోత్సహిస్తారని నిలదీస్తున్నారు. ప్రణయ్ హత్య బాధాకరమే అయినా, అమృత తల్లిదండ్రుల బాధను కూడా అర్ధం చేసుకోవాలి కదా అని అంటున్నారు. ఏ మనిషి అయినా తెల్లవారి లేచింది మొదలు పరువు ప్రతిష్ఠ కుటుంబం గౌరవం అని పరితపిస్తుంటారని, అలాంటిది వారిని రెచ్చగొట్టేలా, అవమానించేలా, వ్యవహరిస్తే వారి గుండెల మీద పెరిగి వారి గుండెల మీదే తన్నేసే పిల్లలను ఎలా సమర్ధిస్తారని అనేకమంది సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. దీంతో రాజకీయ నాయకులు, అధికారులు ఆలోచనలో పడ్డారు. గతంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగినా ఎవరూ తల్లిదండ్రుల పక్షాన ఇంత గట్టిగా మాట్లాడింది లేదు. వారి ఆవేదన అర్ధం చేసుకోవాలని గొంతెత్తి లేదు. ఈ సారి కూడా మీడియా తప్పుడు కథనాలు ఇచ్చిందని, సోషల్ మీడియా మాత్రం వాస్తవాలు వెలుగులోకి తేవడమే కాకుండా, తల్లిదండ్రుల ఆత్మఘోషకు అద్దం పట్టిందని అందరూ ఆలోచనలో పడ్డారు. గతంలో ఇలాంటి ఘనటలు జరిగినప్పుడు హత్యకు గురైన వారి తరఫున కొందరు మాట్లాడేవారు. మిగిలిన వాళ్లు మనకెందుకులే అని మౌనంగా ఉండిపోయేవారు. కానీ ప్రణయ్, అమృత, మారుతీరావు కేసు విషయంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను కుండ బద్ధలు కొట్టినట్టు చెబుతున్నారు. ఎవరూ ఊహించని రీతిలో మారుతీరావుకి మద్దతుగా నిలుస్తున్నారు. మేజర్ అయినంత మాత్రాన ప్రేమించి పెళ్లిచేసుకుంటామంటే కుదరదని, చట్టంలో మార్పులు చేసి, ప్రేమ పెళ్లిళ్లకు తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఇలాంటి ఘటనలు, కేసులు ముందు మంందు జరిగినా ఈ కేసు ఓ బెంచ్ మార్క్ గా నిలిచిపోతుంది. ఘటన జరగగానే సానుభూతి ప్రకటించేసి, వరాలు కురిపించేసే ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడే నేతలకు కూడా కనువిప్పు కలుగుతుంది.

నిందితులు అమృత తండ్రి మారుతీరావుకి, అతడి సోదరుడు శ్రవణ్ కు ఊహించని మద్దతు లభిస్తోంది. ప్రణయ్ గొప్పోడు అన్నట్టు మీడియాలో అవాస్తవాలు వచ్చాయని, సోషల్ మీడియాలో అతడి గురించి కఠోర నిజాలు వెల్లడయ్యాయని ఆర్యవైశ్యులు చెబుతున్నారు. మారుతీరావుకి మద్దతుగా నల్గొండలోని వాసవీభవన్‌ నుంచి జైలు వరకు ఆర్యవైశ్య సంఘం, తల్లిదండ్రుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. శ్రవణ్ తో ములాకత్ లో మాట్లాడారు. బయట అన్ని వర్గాల నుంచి మీకు మద్దతు ఉంది. త్వరలోనే బెయిలుపై బయటకు తీసుకువస్తామని ధైర్యం చెప్పారు. 23 సబ్జెక్టుల్లో ఫెయిలై, చదువూ, సంధ్య ఉద్యోగం, సద్యోగం లేని వాడి విగ్రహాలు ఎలా పెడతారు ? భావితరాలుకు ఏం సందేశం ఇస్తున్నారు ? ప్రణయ్ ఏమైనా దేశభక్తుడా ? సమాజ సేవకుడా ? అసలు ఏం ఉద్ధరించాడని విగ్రహాలు, పరిహారాలు అని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారని బయట సోషల్ మీడియాలో మారుతీరావుకి మద్దతుగా పెద్ద ఉద్యమమే జరుగుతోందని వాళ్లు శ్రవణ్ కు చెప్పారు. చదువు, ఉద్యోగం, బాధ్యత లేకుండా జులాయిగా తిరిగే వాడని, అలాంటి వాడు హత్యకు గురయ్యాడని, అతడి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయ భూమి, ఎనిమిది లక్షల పరిహారం, ప్రభుత్వ స్థలంలో విగ్రహం ఎలా పెడతారంటూ కుల మత ప్రాంతాలకు అతీతంగా జనం ప్రశ్నిస్తున్నారు. విగ్రహ ఏర్పాటుకు అనుమితిచ్చి తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతీయవద్దంటూ కలెక్టర్, ఎస్పీకి వినితి పత్రాలు ఇచ్చారు. మరోవైపు ప్రణయ్‌ క్రైస్తవుడని, అతడి అంత్యక్రియలు క్రైస్తవ సంప్రదాయాల ప్రకారమే జరిగాయని తెలంగాణ మాల యువసేన స్పష్టం చేసింది. ఎస్సీలకు వర్తించే చట్టాలు ప్రణయ్‌కు వర్తింపచేయవద్దని కలెక్టర్‌ను కోరింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఆర్థిక సాయం అందించవద్దని విన్నవించింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చెల్లదని, ప్రేమికులు మేజర్‌ అయినా, ప్రేమ పెళ్లిళ్లకు ఇరువైపుల తల్లిదండ్రుల అంగీకారం ఉండాలని చట్ట సవరణ చేయాలని తల్లిదండ్రుల, ఆర్యవైశ్యులు, వ్యాపారుల సంఘాలు కోరాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -