శిరోముండనం పై నూతన్ నాయుడు ఏమన్నారంటే..?

297
New Naidu responds for the first time after beheading ..?
New Naidu responds for the first time after beheading ..?

రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన నూతన నాయుడు శిరోముండనం కేసు పై తొలిసారి నూతన్ నాయుడు స్పందించారు.. ఈ కేసు విషయమై ఇప్పటికే ఆయన భార్య తో సహా ఏడుగురు అరెస్ట్ అవగా ఇటీవలే పరారీ లో ఉన్న నూతన అరెస్ట్ అయ్యారు.. ఆ తర్వాత  నూతన్ నాయుడు మూడు రోజుల పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.

ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నూతన్‌ను పోలీసులు విచారించారు. ముఖ్యంగా శిరోముండనం విషయంలో తాను పూర్తిగా నిర్దోషినని చెప్పినట్టు సమాచారం. దళిత యువకుడు శ్రీకాంత్‌కు గుండు గీయమని చెప్పలేదని విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. తన ఆరోగ్యం బాగాలేదని పదేపదే చెప్పుకొచ్చాడు.

ఇక, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరు చెప్పి పనులు చేయించుకునే శక్తి తనకు లేదని, ఆ విషయంలో తనపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నాడు. క్రెడిట్ కార్డులు, చీటీలు పాడిన డబ్బులతోనే తాను నెట్టుకొస్తున్నానని చెప్పినట్టు సమాచారం. కాగా, నిన్నటితో నూతన్ నాయుడు పోలీస్ కస్టడీ ముగిసింది.

Loading...