Friday, April 19, 2024
- Advertisement -

SBI బ్యాంకు లో సరికొత్త రూల్స్..!!

- Advertisement -

బ్యాంకు దోపిడీలు, లేదా సైబర్ క్రైమ్, లేదా ఏటీఎం దగ్గర డ్రా చేసిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ ఎక్కువగా అవుతూనే ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది సైబర్ క్రైమ్. మన డబ్బులు ఎప్పుడు, ఎక్కడ, ఎలా పోతాయో మనకే తెలియదు. ఎవరు తీశారో కూడా తెలీదు. కానీ మన డబ్బులు అయితే మాయమైపోతాయి.తర్వాత పోలీసులను ఆశ్రయించడం, వాళ్ళు ట్రాకింగ్ లేదా ఇతర ఏమైనా పద్ధతుల ద్వారా సైబర్ క్రైమ్ నేరస్తులను పట్టుకోవడం జరుగుతాయి. ఇంకా ఏటీఎం దగ్గర కూడా మోసాలు ఎక్కువ గానే జరుగుతాయి. అవి కూడా దాదాపు సైబర్ క్రైమ్ తరహాలోనే ఉంటాయి.

అయితే వీటన్నిటిని నియంత్రించేందుకు ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఒక కొత్త రూల్ అమలుచేసింది. ఒకవేళ మనం 10000 లేదా అంత కంటే ఎక్కువ మొత్తాన్ని డ్రా చెయ్యాలి అనుకున్నప్పుడు, బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి వచ్చే ఓటిపి (OTP) ని ఎంటర్ చేసి డబ్బులని విత్ డ్రా చేసుకోవాలి. అంతకుముందు ఈ సదుపాయం ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉండేది.

కానీ ఇప్పుడు రోజు మొత్తం ఈ సదుపాయం ఉండేలా ఎస్బిఐ యాజమాన్యం కొత్త రూల్ ప్రవేశపెట్టారు. ఒక రోజులో ఎప్పుడైనా సరే క్యాష్ విత్ డ్రా చేసుకోవాలి అంటే ఓటిపి కచ్చితంగా ఎంటర్ చేయాలట. ఈ ఓటిపి బేస్డ్ క్యాష్ విత్ డ్రా రూల్స్ కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కి మాత్రమే వర్తిస్తాయి. సెప్టెంబర్ 18 వ తేదీ నుండి ఈ కొత్త రూల్ అమలు అవ్వనుంది. ఈ కొత్త రూల్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం సైబర్ క్రైమ్స్, ఇంకా ఏటీఎం మోసాలను నియంత్రించడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. కాబట్టి డబ్బులు డ్రా చేయడానికి ఎటిఎం కి వెళ్ళేటప్పుడు ఫోన్ మరిచిపోకండి. ఈ సదుపాయం కస్టమర్లకు ఎంతో సహాయపడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -