Thursday, April 18, 2024
- Advertisement -

బయటపడిన లండన్ పెళ్లికొడుకు కిడ్నాప్ బాగోతం….

- Advertisement -

లండన్ పెళ్లికొడుకు బాగోతం బట్టబయలైంది. రెండేళ్ల నుంచి చెన్నైలోనే ఉంటూ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నానని నమ్మిస్తూ వచ్చిన యువకుడు పెళ్లి చేసుకుంటె తన బాగోతం బట్టబయలు అవుతుందని కిడ్నాప్ డ్రామాకు తెరతీశారు. లండన్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగిన ఓ యువకుడు అర్ధరాత్రి 2 గంటల సమయంలో క్యాబ్‌లో వెళ్తూ అదృశ్యమైన విషయం తెలిసిందే.
పెళ్లి కోసం బుధవారం రాత్రి లండన్ నుంచి వస్తున్నానని తల్లిదండ్రులకు చెప్పాడు ప్రవీణ్. కాని, ఆ తర్వాత ప్రవీణ్ అతని తండ్రికి ఫోన్ చేసి.. తాను ఎయిర్ పోర్టులో దిగానని, క్యాబ్ తీసుకొని ఇంటికి వస్తుండగా క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసి ఎక్కడో నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లాడని, తనను కొట్టి, బంగారు ఆభరణాలతో పాటు నగదును తీసుకెళ్లినట్టుగా తెలిపాడు.

బాధిత యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో అర్ధరాత్రి ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు అసలు విషయం బయట పడేసరికి నోరెళ్లబెట్టారు. యువకుడు విదేశాలకు వెళ్లలేదని నిర్ధారించుకున్న పోలీసులు కిడ్నాప్ డ్రామాను బట్టబయలు చేశారు. వివరాల్లోకి వెల్తే… ఈసీఐఎల్‌ సమీపంలోని దమ్మాయి గూడకి చెందిన ప్రవీణ్‌ రెండేళ్ల క్రితం తనకు లండన్‌లో ఉద్యోగం వచ్చిందని తల్లిదండ్రులను నమ్మించాడు. లండన్‌ వెళ్తున్నానని బయలుదేరి చెన్నై వెళ్లిపోయాడు.

రెండేళ్లుగా అక్కడే ఉంటూ ఇన్నాల్లు లండన్ లో ఉద్యోగం చేస్తున్నానని తల్లి,దండ్రులను నమ్మిస్తూ వచ్చారు.కొడుకు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు అతనికి పెళ్లి సంబంధం కుదిర్చారు. నిశ్చితార్థం కూడా జరిగిపోగా మరో పదిహేనులు రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను విదేశాలకు తీసుకువెళ్లాల్సి ఉంటుందని, ఈ సమయంలో తన గుట్టు రట్టు కావడం ఖాయమని ప్రవీణ్‌ భావించాడు. దీంతో కొత్త డ్రామాకు తెరతీశారు.

ఎయిర్ పోర్టులో దిగిన తనను కిడ్నాప్ చేశారని తల్లి దండ్రులకు ఫోన్ చేశాడు. తల్లి దండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన శంషాబాద్ పోలీసులు ప్రవీణ్ తల్లిదండ్రులను తీసుకొని ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులతో మాట్లాడించడంతో.. పాటు సీసీ కెమరాలను చెక్ చేయించారు. అసలు విషయం బయటపడింది.

ప్రవీణ్ అసలు ఎయిర్ పోర్టుకే రాలేదని నిర్ధారించారు. ఇమ్మిగ్రేషన్‌లో కూడ అతను దేశం విడిచి వెళ్లినట్లుగా కానీ, తిరిగి వచ్చినట్లుగా కానీ.. ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అతను చెన్నైలోనే ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులను మోసం చేయడంతో పాటు తద్వారా తమను పక్కదారి పట్టించినట్లుగా గుర్తించారు పోలీసులు. ప్రవీణ్‌ అసలు లండన్‌ వెళ్లలేదని, చెన్నైలోనే ఉంటూ పెళ్లినాడు ఈ విషయం బయటపడుతుందని కిడ్నాప్‌ డ్రామా ఆడాడని తేల్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -