Friday, March 29, 2024
- Advertisement -

దుర్గగుడి సింహాల మాయం విషయంలో కొత్త ట్విస్ట్…?

- Advertisement -

అసలే రాష్ట్రంలో ఉన్న సమస్యలు చాలక కొత్తగా దేవాలయాల్లో చోరీ, రథం దగ్ధం విషయాలు ఇప్పుడు ప్రభుత్వానికి కొత్త సమస్యను తెచ్చి పెడుతున్నాయి.. చీమ చిటుక్కుమన్నా ప్రతిపక్షాలు అది వైసీపీ చీమే అని రెచ్చిపోయి విమర్శలు చేస్తుంటారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాలపై దాడి విషయంలో మాత్రం గతంలో ఎప్పుడు లేనంతగా విమర్శల డోసు పెంచుతూ ప్రభుత్వాన్ని అసహనానికి గురిచేస్తుంది.. బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ ల నేతలు అయితే జగన్ దగ్గరుండి వారికి భంగం కలిగించారన్నట్లు ఆరోపిస్తున్నారు.. దేవాలయాలపై దాడి హిందువుల మోనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నది వాస్తవం..

అయితే దానికి సమాధానం వెతికే విధంగా ముందుకు వెళ్ళాలి కానీ ఇలా ప్రభుత్వాన్ని విమర్శించి ఏమొస్తుందో అర్థం కావట్లేదు.. ఇప్పటికే అంతర్వేది విషయంలో అందరికి న్యాయం జరిగేలా జగన్ వ్యవహరించారు.. అయినా ఎదో తక్కువయినట్లు ప్రతిపక్షాలు వ్యవహరించడం కొన్ని అనుమానాలకు దారి తీస్తుంది. ఇక విజయవాడ లో దుర్గ గుడి లో సింహాల మాయం విషయం ఇప్పుడు కొద్ది కొద్ది గా ముదురుతూ వస్తుంది. స్థానికంగా ఈ ఘటన కొంత కలకలం రేపగా ఈ సింహపు ప్రతిమల మాయం కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. ముందునుంచి అనుకున్నట్లు ఈ ప్రతిమలు చోరీ జరిగినట్లు నిర్ధారణ అయ్యింది.

ఆలయ చైర్మన్ పోలీసులకు కేసు నమోదు చేయగా మొత్తం నాలుగు వెండి సింహం ప్రతిమలకు గానూ అందులో మూడు చోరీ అయినట్లుగా గుర్తించారు.గత ఏడాది కాలంగా రథం తీయలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వెండి రథాన్ని 2002లో తయారు చేయించారు. కనిపించకుండా పోయిన సింహపు ప్రతిమ 3.365 కిలోల వెండితో చేశారు. 2019 ఏప్రిల్ నుంచి ఈనెల 15లోపు చోరీ జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు చోరీకి గురైన వెండి ప్రతిమలు దాదాపు 20 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ వెండి సింహాల ప్రతిమల చోరీ ఘటన పై సీరియస్ గా ఉంది.. ఇప్పటికే ఓ కమిటీ వేసి విచారణ ప్రారంభించింది.. అయితే ఇంతటి కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో ప్రతిమలు చోరీ అవడం అనుమానాలకు దారి తీస్తుంది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -