Thursday, April 25, 2024
- Advertisement -

ఇన్నాళ్లు జైల్లో ఉన్న నిర్భయ దోషులు ఎంత సంపాదించారంటే ?

- Advertisement -

రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించడంతో నిర్భయ దోషులకు చివరి అవకాశం కూడా పోయింది. దాంతో ఊరితీతే తరువాయి అయింది. 2012లో నిర్భయ ఘటన జరిగింది. అప్పటి నుంచి విచారణలు, కోర్టు తీర్పులు, చివరికి డెత్ వారెంట్ తో ఉరిశిక్ష అమలు వరకు వెళ్లింది. ఈ క్రమంలో నిర్భయ దోషుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

నిర్భయ దోషులు ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్, పవన్ ఏడేళ్లుగా తీహార్ జైల్లో ఉంటున్నారు. జైల్లో వారి చేత వివిధ పనులు చేయించారు. ఆ విధంగా అక్షయ్ రూ.69 వేలు సంపాదించగా, వినయ్ శర్మ రూ.39 వేలు, పవన్ రూ.29 వేలు సంపాదించారు. వీరిలో ముఖేశ్ ఏ పని చేయలేదు. ఇప్పుడు వీరు సంపధించిన డబ్బులను వారి మరణాంతరం వారి కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. అయితే ఈ దోషులు నలుగురు చదువుకునేందుకు కూడా ప్రయత్నించారు.

ఐదేళ్లకిందట బీఏ చదివేందుకు అర్హత పరీక్ష రాయడం ద్వారా వినయ్ శర్మ ఉత్తీర్ణుడు అయినా, డిగ్రీ చదవలేకపోయాడు. అక్షయ్, పవన్, ముఖేశ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసినా పాస్ కాలేకపోయారు. కాగా, అన్ని అవకాశాలు ముగిసి ఉరిశిక్ష ఖాయమని తేలడంతో దోషుల ప్రవర్తనలో మార్పు వచ్చిందని జైలు వర్గాలంటున్నాయి. నలుగురు ఆందోళనగా కనిపిస్తున్నారని, ఒక్కోసారి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా వినయ్ శర్మ తన గదిలో అదేపనిగా నడుస్తూనే ఉంటున్నాడని అధికారులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -