నిత్యానందా.. ఏమిటిదంతా?

1165
Nithyananda island: Govt cancels passport of Nithyananda
Nithyananda island: Govt cancels passport of Nithyananda

వివాదాస్పద మత గురువు నిత్యానంద మళ్లీ వార్తల్లోకి వచ్చారు. అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన ఈ స్వయం ప్రకటిత దేవుడు ఈక్విడార్ సమీపంలో సొంత దేశాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏకంగా ఒక ద్వీపాన్ని ఖరుదు చేసి సొంతంగా రాజ్యాన్ని స్థాపించిన ట్టు బిల్డప్ ఇచ్చాడు.

తానే సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేసినట్టు నిత్యానంద చెప్పిందంతా సోదని తేలిపోయింది. దీవి కోనుగోలు చేయడానికి నిత్యానంద తమను అసలు సంప్రదించలేదని ఈక్విడార్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయనే కాదు ఎవరు తమను సంప్రదించలేదని ఈక్విడార్ ప్రకటించింది.

మరోవైపు నిత్యానంద దేశం నుంచి పారిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీరిగ్గా స్పందించింది. నిత్యానంద పాస్ పోర్టును రద్దు చేస్తున్నట్లు మోదీ సర్కారు తాజాగా ప్రకటించింది. ఈ పనేదో ముందే చేసుంటే నిత్యానంద దేశం విడిచి పారిపోకపోను కదా అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

భారత్ నుంచి తెలివిగా తప్పించుకున్న నిత్యానంద ఎక్కడ ఉన్నాడన్నదే అసలు ప్రశ్న. అతడిని స్వదేశానికి తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టాలని ప్రభుత్వాన్ని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Loading...