Thursday, April 25, 2024
- Advertisement -

నోయిడాలోని మెట్రో హాస్పిటల్‌లో భారీ అగ్నిప్ర‌మాదం…

- Advertisement -

గ్రేటర్ నోయిడాలోని ఓ ఆస్పత్రిలో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. సెక్టార్ 12లోని మెట్రో హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో అందులో భారీగా రోగులు చిక్కుకున్నారు. హాస్పిటల్ భవనంలో దట్టమైన పొగలు అలముకోవడంతో లోపల చిక్కుకున్నవారు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. విష‌యం తెలుసుకున్న అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డ‌కు చేరుకొని 12 ఫైరింజన్ల‌తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆస్పత్రి లోపల చిక్కుకున్న వందలాది మంది రోగులను బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు, అధికారులు యత్నిస్తున్నారు. కిటికీలను పగులగొట్టి రోగులను బయటకు తీసుకువస్తున్నారు ఫైర్‌ సిబ్బంది. ఆసుప‌త్రిలోని మొద‌టి అంత‌స్తులో ఈ అగ్నిప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. ప్ర‌మాదానికి కార‌ణాలు తెలియ రాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -