Thursday, April 18, 2024
- Advertisement -

చనిపోయి మేక ఎంత పనిచేసింది…

- Advertisement -

మేక మరణించి ఓ సంస్థకు రూ. 2.7 కోట్ల భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. మేక చనిపోవడం ఏంటి….? అంత నష్టం భారీ నష్టాలు ఏంటి అనుకుంటున్నారా….? మీరు వింటున్నది నిజమే. కొన్ని సార్లు అనుకకోకుండా అలాంటి సంఘటనలు జరుగుతుంటాయి.అన్ని కోట్ల నష్టం వాటిల్లింది మరే సంస్థకో కాదు.. భారతదేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన కోల్ ఇండియాకి చెందిన మహానంది బొగ్గు క్షేత్రం (ఎంసీఎల్‌). ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

మహానంది బొగ్గు క్షేత్రం ఉన్న సంబల్ పూర్‌ ప్రాంతంలోని,నిషేధిత మైనింగ్ జోన్‌ పరిధిలో జరిగిన ఓ ప్రమాదంలో మేక చనిపోయింది. చనిపోయిన మేక సమీప గ్రామస్తులది కావడంతో,అక్కడ వుండే స్థానికులు ఆమేక యజమానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారట. దీంతో అక్కడ దాదాపు మూడున్నర గంటల పాటు ఎంసీఎల్‌ వద్ద బొగ్గు రవాణా నిలిచిపోయిందని దాని వల్ల సంస్థకు రూ.2.7 కోట్లు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.

గ్రామస్తులు ఎంతగా సర్దిచెప్పిన గ్రామస్థులు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశంచేసి పరిస్థితిని చక్కదిద్ది,ఆందోళనను విరమింపచేసారట.అప్పుడుగాని బొగ్గురవాణా పనులు తిరిగి ప్రారంభం అయ్యాయట. స్థానిక ప్రజలు బొగ్గు,కట్టెలకోసం,అలాగే వారి పశువులను మేపేందుకు తమ పరిధిలోని నిషేధిత ప్రాంతాల్లోకి అక్రమంగా చొరబడతారని అధికారి తెలిపారు. మొత్తానికి ఓ మేక మరణం ఇన్ని కోట్ల నష్టాన్ని తెస్తుందని ఎవరూ ఊహించి ఉండరు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -