Thursday, March 28, 2024
- Advertisement -

ఆన్ లైన్ డేటింగ్ తో రూ. 45ల‌క్ష‌లు పోగొట్ట‌కున్న వృద్ధుడు

- Advertisement -

ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన త‌ర్వాత మనమలు, మనవరాళ్లతో కాలక్షేపం చేయాల్సిన వయసులో ఓ వృద్ధుడు ఆన్‌లైన్ డేటింగ్ కోసం ఆశ‌ప‌డి దారుణంగా మోస‌పోయాడు. అతని కోరికను అలుసుగా తీసుకున్న డేటింగ్ వెబ్ సైట్, ఓ అమ్మాయిని రంగంలోకి దించగా, మాయమాటలు చెబుతూ, రూ. 46 లక్షలు కొల్ల‌గొట్టారు డేటింగ్ వెబ్‌సైట్ నిర్వ‌హాకులు. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత వ‌చ్చిన సొమ్మంతా పోగొట్టుకున్నానని వాపోయాడు.

వివ‌రాల్లోకి వెత్తే….ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తూ రిటైర్‌ అయన 65 ఏళ్ల వృద్ధుడు 2018 మేలో ఓ డేటింగ్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ అయ్యాడు. వెబ్‌సైట్‌లో నమోదైన తర్వాత ఆయన మీరా అనే మహిళ నుంచి ఫోన్‌ కాల్‌ రిసీవ్‌ చేసుకున్నారు. డేటింగ్‌ సైట్‌లో ప్రీమియం మెంబర్‌గా నమోదయ్యేందుకు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలని బాధితుడిని కోర‌డంతో ఆపై ముగ్గురు మహిళల ఫొటోలను పంపగా, ఒకరిని ఎంచుకున్నాడు. ఆమెతో ఏడాది డేటింగ్ చేసేందుకు రూ. 10 లక్షలు కట్టాలని చెబితే, ఆశతో ఆ డబ్బు కట్టాడు.

ఆ తర్వాత బీమా, పోలీస్‌ వెరిఫికేషన్‌ అంటూ బాధితుడి నుంచి పలుమార్లు పెద్దమొత్తంలో ఆమె వసూలు చేసింది. అప్పటికే మీరాకు రూ 30 లక్షలు ముట్టచెప్పడంతో చివరికి ఆయన ఎంపిక చేసుకున్న మహిళ ఫోన్‌ నెంబర్‌ను అందచేసింది. ఈ మహిళ తనను రోజీ అగర్వాల్‌గా బాధితుడికి పరిచయం చేసుకుంది. రోజీ సైతం ఏవో సాకులతో సదరు వృద్ధుడి నుంచి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసింది. చ‌వ‌ర‌కు డేటింగ్‌కు రాక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన వృద్దుడు రిజిస్ట‌ర్ చేసుకున్న వెబ్‌సైట్‌ను పరిశీలించగా యూజర్‌ రివ్యూల్లో ఇది మోసపూరిత వెబ్‌సైట్‌ అనే కామెంట్‌ చూడటంతో తాను మోసపోయానని గ్రహించాడు. పరువు పోతుందని భావించిన ఆయన కొన్ని నెలల పాటు మౌనంగా ఉండి, చివరకు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో, వారు పోలీసులను ఆశ్రయించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -