నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్తత…

1191
OU students attack on Najarjuna House
OU students attack on Najarjuna House

అందరూ ఎప్పుడుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ టీవీ షో ఎట్టకేలకు రేపు రాత్రి నుంచి మొదలు కానుంది. ఈ సారి షో విషయం లో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే షో లో కంటెస్టెంట్స్ గా ఎవరెవరు ఉంటారు అనే విషయం మీద ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు కానీ సోషల్ మీడియా లో మాత్రం చాలా పేర్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యం లో షో మీద వివాదాలు కూడా ముదురుతున్నాయి. షో ని రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా పోరాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో ఆపేయాలని డిమాండ్ చేస్తూ వారు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. తాజా గా షో టెలికాస్ట్ డేట్ వచ్చేసిందని, ఇంకా ఏ నిర్ణయం వెలువడలేదు అని, నాగార్జున ఇంటి ముట్టడించే ప్రయత్నం చేసారు విద్యార్థులు.

ముందు జాగ్రత్త గా నాగార్జున ఇంటి వద్ద ఇప్పటికే పోలీసులు భద్రత ని పెంచిన సంగతి తెలిసిందే. ఇలా విద్యార్థులు ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేయగానే, పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. ఈ నేపథ్యం లో షో నిర్వాహకులు కానీ నాగార్జున కానీ ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది.

Loading...