Thursday, April 25, 2024
- Advertisement -

పెట్టుబడులకోసం అమ్మాయిల్ని ఎరగా వేస్తున్న పాక్.. ఈ వీడియో చూడండి

- Advertisement -

ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టు మిట్టాడుతున్న పాక్ పెట్టుబడులకోసం మరో నీచానికి దిగజారింది. బెల్లీ డ్యాన్సర్ల చేత పెట్టుబడిదారులకు కనువిందు చేయించి… వారిని బుట్టలో వేసుకునేందుకు యత్నిస్తోంది. ప్రభుత్వ దిగజారుడుతనంపై ఆ దేశ ప్రజలే విమర్శలు చేస్తున్న ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు.పాకిస్థాన్‌ దిగజారి ప్రవర్తించడంపై నెటిజన్లు తనదైన శైలిలో ఓ ఆట ఆడుకుంటున్నారు. భారత్‌ చంద్రయాన్‌-2 మిషన్‌లో నిమగ్నమై ఉంటే.. పాక్‌ మాత్రం బెల్లీ మిషన్‌ను సమర్థంగా నిర్వహించిందంటూ ఎద్దేవా చేస్తున్నారు.పెట్టుబడులను ఆకర్షించేందుకు పాకిస్థాన్ కొత్త మార్గాన్ని కనుగొందని మరో కరు విమర్శిస్తున్నారు.

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఇమ్రాన్ ప్రభుత్వం పెట్టుబడిదారులను కోరుతోంది. ఈ వారం అజర్‌బైజాన్‌లో ఓ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్ నిర్వహించింది.ఎస్‌సీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో బెల్లీ డ్యానర్లలతో హాట్ హాట్‌గా డ్యాన్స్ చేయించడం ఆశ్చర్యపరిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -