Tuesday, April 23, 2024
- Advertisement -

భారత్ ఆశ్రయం కోరిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే…

- Advertisement -

పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బల్దేవ్ కుమార్ భారత ఆశ్రయం కోరడం సంచలనంగా మారింది.పాకిస్థాన్‌లో మైనార్టీలైన హిందువులు, సిక్కులను చంపేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన కుటుంబతో కలిసి పాకిస్థాన్ వదిలి భారత్ వచ్చేశారు.

పాకిస్తాన్‌లో మైనార్టీ మతస్తులపై దాడులు ఎక్కువయ్యాయని ఆయన చెప్పారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ పక్తుంక్వా జిల్లాలోని రిజర్వ్ సీటు అయిన బారికోట్‌‌ నియోజకవర్గానికి ఒకప్పుడు ఎమ్మెల్యేగా సేవలందించారు.ప్రస్తుతం బల్దేవ్ కుమార్ భారత్‌లో మూడునెలల వీసాపై వచ్చారు. ఆగష్టు 12న ఆయన భారత్‌కు వచ్చారు. అంతకంటే ముందు తన భార్య ఇద్దరు పిల్లలను భారత్‌లోని లుధియానాలో ఉన్న తమ బంధువుల ఇంటికి పంపించారు.

ఈ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.నూతన పాకిస్తాన్‌ను నిర్మిస్తానని ప్రమాణం చేసిన ఇమ్రాన్‌ ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదని ఆరోపించాడు. పాక్‌లో హిందువులు, సిక్కులపై దారుణాలు జరుగుతున్నాయని వాటిని అడ్డుకోవాలని కోరాడు.భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ తన విన్నపాన్ని మన్నించి భారత్‌లో ఆశ్రయం కల్పిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశాడు.

సోరన్‌సింగ్ అనే వ్యక్తి హత్య కేసులో బల్దేవ్‌పై అరోణలున్నాయి. పోలీసులు ఆయనను తీవ్రంగా వేధించారు.ఈ కేసులో బల్దేవ్‌పై చేసిన ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదలచేసింది.అనంతరం పాకిస్థాన్‌లో ఉండడం క్షేమం కాదని భావించిన బల్దేవ్ భార్య, పిల్లలతో కలిసి భారత్ చేరుకున్నారు. తనకు ఆశ్రయం కల్పించాలని మోదీ ప్రభుత్వాన్ని కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -