Friday, April 19, 2024
- Advertisement -

అక్కడ డీజిల్, పెట్రోల్ కంటే లీటర్ పాల ధరే ఎక్కువ…

- Advertisement -

పాకిస్తాన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలతో పాల ధరలు పోటీ పడుతున్నాయి. మొహర్రం పర్వదినం సందర్భంగా పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాల్లో పాల ధరలు ఆకాశాన్నంటాయి. మామూలుగా అయితే పాల ధర రూ.60 కంటె మించి ఉండదు. కాని పాక్ లో మాత్రం లీటర్ పాల ధర ఇప్పుడు రూ.140 పలుకుతోంది.

రాచీ, సింధు ప్రావిన్స్‌ వంటి ప్రాంతాల్లో లీటరు పాలకు ఏకంగా రూ. 140 వరకు వసూలు చేశారు. రెండ్రోజుల కిందట పాక్‌లో లీటరు పెట్రోల్‌కు రూ. 113, లీటరు డీజిల్‌కు రూ. 91 ధర ఉంది. మొహర్రం సందర్భంగా జరిగే ఊరేగింపులో పాల్గొనేవారికి సబీల్స్‌ (స్టాల్స్‌) ఏర్పాటుచేసి.. ఉచితంగా పాలు, పళ్లరసాలు, తాగునీరు అందిస్తారు. ఇలా సబీల్స్‌ కోసం పెద్ద ఎత్తున పాల డిమాండ్‌ ఏర్పడటంతో కరాచీలో పాల ధరలు అమాంతం చుక్కలనంటాయి.

పాల ధర నియంత్రణకు కరాచీ కమిషనర్‌ ఇఫ్తీకార్‌ షాల్వానీ చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ధరలు ఆకాశాన్నంటినా ఆయన పట్టించుకోలేదని పలు పాక్‌ పత్రికలు పేర్కొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -