Thursday, March 28, 2024
- Advertisement -

బాబుకు ఓట‌మిని గిప్ట్‌గా ప‌సుపు, కుంకుమ ప‌థ‌కం చెళ్లెమ్మ‌లు….

- Advertisement -

వెయ్యిగొడ్ల‌ను తిన్న రాబందు ఒక్క గాలి వాన‌కు నేల కూలిన‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు టీడీపీ ప‌రిస్థితి అలాగె ఉంది. చివ‌ర‌కు చంద్ర‌బాబు పాపంప‌డింది. ఒక నియంత‌లాగా పాల‌న చేసిన బాబును ప్ర‌జ‌లు బంగాళాఖాతంలో క‌లిపారు. పాపం పండిన‌ప్పుడు ఎవ‌రూ కాపాడ‌లేరు అనె సామెత ఇప్పుడు బాబుకు స‌రిపోతుంది.

ప్ర‌స్తుతం ఫ‌లితాలు చూస్తుంటె టీడీపీ ఘోర ప‌రాజ‌యం దిశ‌గా ప‌య‌నిస్తోంది. క‌నీసం అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష‌పార్టీ హోదాకూడా ద‌క్కుతుందా లేదా అన్న‌ది అనుమానంగానె ఉంది. పసుపు-కుంకుమ పథకాలు తమను గెలుపు తీరాలకు చేరుస్తాయని ఆ పార్టీ నేతల‌తో పాటు బాబుకూడా గంపెడు ఆశ‌లు పెట్టుకున్నారు. కాని వారి ఆశ‌ల‌ను గ‌ల్లంతు చేశారు ప్ర‌జ‌లు.

ఏపీలో మహిళల ఓటు బ్యాంకు ఎక్కువగా వుందని భావించిన చంద్రబాబు పసుపు-కుంకుమ పథకం ద్వారా మహిళల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం సఫలం అయ్యిందని మహిళలు చంద్రబాబును ఆశీర్వదించారని టీడీపీ నేతలు భావించారు. బాబు కూడా అదే ధీమాతో ఉన్నారు. అయితే ఫ‌లితాలు చూస్తె చిర‌వ‌కు అడ్డం తిరిగింది.

50 లక్షల మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ పథకం’ కింద రూ.9 వేలు, రూ.15 వేల చొప్పున టీడీపీ సర్కారు పెట్టుబడి సాయం ప్రకటించింది. దీనిలో పట్టాభూముల రైతులకు ఇప్పటికే 2 విడతలుగా రూ.4 వేలు జమ చేసింది. కౌలు రైతులకు ఖరీఫ్‌ సీజన్‌లోగా పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కాని అవేవి టీడీపీని గట్టెక్కించ‌లేక‌పోయాయి. ఒక్క సారి ప్ర‌జ‌ల్లో మార్పు వ‌స్తె ఎన్ని జిమ్మిక్కు ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టినా అవ‌న్నీ ఫ‌నిచేయ‌వ‌న్న‌ది ఈ ఫ‌లితాలు చూస్తుంటె అర్థ‌మ‌వుతోంది. ఫ‌లితాల్లో వైసీపీ దూసుకుపోతోంది. 150 అసెంబ్లీ సీట్లుతోపాటు 25 ఎంపీ సీట్ల‌ను క్లీన్ స్విప్ చేసె దిశ‌గా దూసుకెల్తోంది. ఇక చంద్ర‌బాబు సాయంత్రం త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -