Saturday, April 20, 2024
- Advertisement -

పవన్ పేరుతో లేఖ కలకలం..

- Advertisement -

టాలీవుడ్ మోస్ట్ పవర్ ఫుల్, పాపులర్ హీరో పవన్ కళ్యాణ్. అయితే సినిమాలు వదిలి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చారు పవన్. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో అంతటా నిరాశ నెలకొంది. దీంతో ఫ్యాన్స్, జనసేన సైనికులు అంతా పవన్ సినిమాల్లో కంటిన్యూ అవుతూనే రాజకీయాల్లో కొనసాగాలని డిమాండ్లు వినిపించాయి.

అయితే తాజాగా పవన్ కళ్యాన్ పుట్టినరోజు వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. తాను మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్.. త్వరలోనే సినిమాలకు సైన్ చేయబోతున్నట్టు పేర్కొంటూ పవన్ కళ్యాణ్ అభిమానులకు రాసినట్లు ఆ లేఖ ఉంది. దీంతో పవన్ సినిమాలకు ఒప్పుకున్నాడంటూ అందరూ తెగ సంబరపడిపోయారు.

అయితే తాజాగా దీనిపై పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి మీడియాకు వివరణ ఇచ్చారు. పవన్ బర్త్ డే సందర్భంగా కొందరు ఓర్వలేని వారు పవన్ పేరిట ఈ తప్పుడు లేఖ సృష్టించినట్టు పార్టీ దృష్టికి వచ్చింది. ఆ లేఖ పచ్చి మోసపూరితమైనది.. పవన్ సినిమాల్లోకి వస్తున్నాడన్నది వట్టి అబద్ధం అని స్పష్టం చేశారు.

అయితే ఈవివాదం అక్కడితో ఆగిపోలేదు. తప్పుడు లేఖను సర్క్యూలేట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి లీగల్ గా చర్యలు తీసుకునేందుకు పార్టీ లీగల్ విభాగం సిద్ధమైంది. ఈ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియాలో ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -