Thursday, March 28, 2024
- Advertisement -

దారునంగా అట్ట‌ర్ ప్లాప్ అయిన మోదీ చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యం..

- Advertisement -

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 2016 సెప్టెంబ‌ర్‌లో ఎవ‌రితో చ‌ర్చించ‌కుండా గుట్టుచ‌ప్పుడు కాకుండా రాత్రి నోట్లు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించారు. న‌ల్ల ధ‌నాన్ని అరిక‌ట్ట‌డానికి ప్ర‌భుత్వం సంధించిన అస్త్రంగా మ‌హా గొప్ప‌గా ప్ర‌క‌టించారు. కుప్పులు తెప్ప‌లుగా ఉన్న న‌ల్ల ద‌నం అంతా ఆగిపోతుంద‌ని చెప్పిన విష‌యం తెలిసిందే.

అయితే మోదీ తీసుకున్న ఆ నిర్ణ‌యం బిగ్ షాక్ ఇచ్చింది. గ‌డ‌చిన నాలుగేళ్ళ‌ల్లో మోడి తీసుకున్న అనేక అసంబ‌ద్ధ‌మ‌న నిర్ణయాల్లో పెద్ద నోట్లర‌ద్దు ముందువ‌ర‌స‌లో ఉంటుంది. నోట్ల ర‌ద్దుతో ప్ర‌జ‌లు బ్యాంకులు, ఏటీఎమ్‌ల ద‌గ్గ‌ర క్యూలో నిల‌బ‌డి నానా క‌ష్టాలు ప‌డ్డారు. కొంద‌రు చ‌నిపోయిన సంగ‌ట‌నులు ఉన్నాయి.

బ్లాక్ మ‌నీని బ‌య‌ట‌కు ర‌ప్పించ‌ట‌మే నోట్ల ర‌ద్దు ఉద్దేశ్య‌మ‌ని మోడి దేశ‌మంతా తిరిగి చెప్పుకున్నారు. జ‌నాలు కూడా నిజ‌మే అనుకునే క‌ష్టాల‌ను, న‌ష్టాల‌ను భ‌రించారు. కానీ ఇపుడు జ‌రిగిందేంటి ? నోట్ల ర‌ద్దు జ‌రిగిన రెండేళ్ళ త‌ర్వాత రిజ‌ర్వ్ బ్యాంకు లెక్క‌లు బ‌య‌ట‌పెట్టింది. బ‌య‌ట‌ప‌డిన లెక్క‌ల‌తో మోడికి దిమ్మ తిరిగింది.

రిజ‌ర్వ్ బ్యాంకు లెక్క‌ల్లో తేలిన విష‌యం ఏంటంటే ర‌ద్దైన పెద్ద నోట్ల‌లో 99.3 శాతం నోట్లు బ్యాంకుల‌కు తిరిగి వచ్చింద‌ని అధికారికంగా ప్ర‌క‌టించింది ఆర్‌బీఐ. ఇక మోదీ అన్న‌ట్లు న‌ల్ల‌ధ‌నం ఎక్కుడుందీ. మోడి స‌ర్కార్ కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టింద‌న్న విష‌యం అర్ధ‌మైపోతోంది. నోట్ల ర‌ద్దు చేసిన‌పుడు మోడి సుమారు రూ. 5 ల‌క్ష‌ల కోట్లు బ్లాక్ మ‌నీ ఉంద‌ని చెప్పారు.

మోడి చెప్పిన ప్ర‌కారం అప్ప‌ట్లో రూ. 15.41 ల‌క్ష‌ల కోట్ల పెద్ద నోట్లు చెలామ‌ణిలో ఉండేది. అందులో సుమారు రూ. 5 ల‌క్ష‌ల కోట్లు బ్లాక్ మ‌నీగా లెక్కేశారు. కానీ ఇపుడు నిక‌రంగా తేలిందేమంటే బ్యాంకుల‌కు రాని పెద్ద నోట్లు రూ. 10, 727 కోట్లు మాత్ర‌మేన‌ట‌. బ్యాంకుల‌కు రాలేదన్నంత మాత్రాన అదంతా బ్లాక్ మ‌నీగా లెక్కేసేందుకు లేదు. కొత్త నోట్ల‌ను ముద్రించిన దానికి అయిన ఖ‌ర్చు రూ.25 వేల కోట్లు.

నోట్టర‌ద్దు వ‌ల్ల దేశ ఆర్ధిక వ్య‌వ‌స్ద‌కు జ‌రిగిన న‌ష్టం సుమారు రూ. 2.25 ల‌క్ష‌ల కోట్లు. సో, ఇవ‌న్నీ చూస్తుంటే బ్ల‌క్ మ‌నీని వెలికితీయ‌డం, న‌కిలీ క‌రెన్సీని అరిక‌ట్ట‌డం సాధ్యం కాద‌ని తేలిపోయింది. కోట్లాది పని గంటలు బ్యాంకుల ఏటీఎంల దగ్గర పడిగాపులు కాసేందుకు.. తమ దగ్గరున్న పెద్దనోట్లను మార్చుకోవటానికి వెచ్చించాల్సి వచ్చింది. మోదీ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం ఘోరంగా విఫ‌ల‌మ‌య్యింద‌నే చెప్ప‌వ‌చ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -