ట్రంప్ భార్యకు మోడీ ఇస్తున్న గిఫ్ట్ ఇదే..!

846
PM Modi gives special gift to US president wife Melania Trump
PM Modi gives special gift to US president wife Melania Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబతో భారత్ కు వస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు అహ్మదాబాద్ కి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయనకు భారత్ ఘన స్వాగతం పలకనుంది. అయితే ట్రంప్ భార్య, కూతురు, కొడుకు, అల్లుడు ఇకా ఫ్యామిలీ మొత్తం భారత్ కు వస్తున్నారు.

ఈ నేపథ్యంలో ట్రంప్ భార్యకు మోడీ అద్భుతమైన బహుమతి ఇచ్చేందుకు ఓ అరుదైన చీరను సిద్దం చేయించారు. ఇక పటోలా చీరా ప్రత్యేకత గురించి చూస్తే.. పటోలా చీర అంటే ఇది గుజరాత్ సంస్కృతిలో ఓ భాగం. ఈ చీరను ఆరుగురు కలిసి చేతితో నేస్తారు. ఈ చీర తయారికి దాదాపుగా ఆరు నెలల టైం పడుతుంది. చెట్ల నుండి తీసుకున్న సహజరంగులను ఈ చీర కోసం వాడుతారు.

గుజరాత్ కు పటోలా చీర బ్రాండ్ క్రియేట్ చేసింది. ఇక ఎన్ని సంవత్సరాలు వాడిన ఈ చీరలో మెరుగు తగ్గదు. ఉతికినా రంగు పోదు. పఠాన్ లోని సాల్వి కుటుంబం ఈ చీరను తయారు చేస్తుంది. బంగారంతో తయారు చేస్తున్న ఈ ఖరీదైన చీరను మోడీ తాజా పర్యటనలో ట్రంప్ భార్యకు ఇవ్వబోతున్నాడు.

Loading...