Tuesday, April 23, 2024
- Advertisement -

మోడీ కోరికలు.. తప్పా? ఒప్పా.?

- Advertisement -

తుమ్మితే ఊడిపోయే పదవులు.. దశాబ్ధాలుగా పార్టీ కోసం పనిచేసిన పెద్దమనిషి ఆయన.. పార్టీ కోసం ప్రాణమిచ్చేంత పట్టుదల.. దాంపత్య జీవితాన్ని త్యజించి.. భార్యకు దూరంగా పార్టీయే పరమావధిగా పనిచేశారు. చివరకు దేశానికి ప్రధాని అయ్యారు. అందుకే ఇన్నాళ్లు తనలో గూడు కట్టుకున్న చిన్న చిన్న కోరికలను ఇలా తీర్చేసుకుంటున్నారు.. ప్రధాని నరేంద్రమోడీ గురించే ఇదంతా..

బీజేపీలో కార్యకర్తగా.. సీఎంగా, ఇప్పుడు ప్రధానిగా 60 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో మోడీ రాజకీయాన్ని తప్పితే బయటి ప్రపంచాన్ని చూసింది తక్కువ. అందుకే ప్రధాని కాగానే తన కోరికలను నెరవేర్చుకుంటున్నారు. వరుసగా విదేశీ పర్యటనలకు వెళుతూ.. అక్కడి ప్రకృతి సిద్ధ క్షేత్రాలు.. పర్యాటక క్షేత్రాలు ఇలా అన్ని ప్రధాని హోదాలోనే తిలకిస్తూ తన ముచ్చట తీర్చేసుకుంటున్నాడు.

తాజాగా ప్రఖ్యాత డిస్కవర్ చానెల్ లో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో భాగంగా ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో సాహసికుడు బేర్ గ్రిల్స్ తో కలిసి మోడీ పాల్గొని సాహసయాత్రను కొనసాగించాడు. దట్టమైన అడువులు, క్రూర మృగాల మధ్య గడిపారు.

అయితే మోడీ పాల్గొన్న టైమింగే తప్పు. ఓ వైపు పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత జవాన్లను హతమార్చిన పుల్వామా ఉగ్రదాడి సమయంలోనే ప్రధాని ఇలా సాహసయాత్ర చేయడం వివాదాస్పదమైంది. దీనిపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

మోడీ వ్యక్తిగత హోదాలో ఇలాంటి అడ్వంచర్లు, సాహసయాత్రలు చేస్తే ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు ఆయన భారత ప్రధాని. ఆ పదవికి వన్నె తెచ్చే వ్యక్తి. ఇందులో రాగద్వేశాలకు అతీతంగా పనిచేయాలి. కానీ తనలోని జిహ్వ చాపల్యంతో ప్రధానిగా ఉంటూనే ఇలా యాత్రల పేరిట వార్తల్లో నిలవడమే విమర్శకులకు తావిస్తోంది. అందుకే జర్మన్ లో ఉంటే జర్మన్ లా ఉండాలన్న సామెత ప్రకారం.. ప్రధాని హోదాలో ఉన్న ఆ పదవికి వన్నె తేవాలి. కాసింత తనలోని ఈ కోరికలను అదుపు చేసుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

వీడియో ఇదే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -