Wednesday, April 24, 2024
- Advertisement -

పోల‌వ‌రంలో జ‌రిగిన అక్ర‌మాల‌ను నిగ్గుతేల్చిన నిపుణుల క‌మిటీ… వాట్ నెక్ట్స్‌..?

- Advertisement -

పోల‌వ‌రం ప్రాజెక్టు ఏపీకీ జీవ‌నాడి లాంటిది. గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఈప్రాజెక్టులో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని వైసీపీ ఆరోప‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. మేము అధికారంలోకి వ‌స్తే జ‌రిగ‌న అక్ర‌మాల‌ను వెలికి తీస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అనుకున్న‌ట్లుగానె వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నె ప్రాజెక్టులో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌ను నిగ్గు తేల్చేందుకు నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేశారు సీఎం జ‌గ‌న్‌.

నిపుణుల క‌మిటీ నివేదిక‌ను ఈ రోజు ప్ర‌భుత్వానికి అందించింది. ప్రాజెక్టులో భారీగా అక్ర‌మాలు జ‌రిగాయ‌ని నిపుణుల క‌మిటీ నిగ్గు తేల్చింది. గత ఒప్పందాల రద్దుకు నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. పోలవరం టెండర్లపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని నిపుణుల కమిటీ నివేదిక ప్రభుత్వానికి సూచించింది.

టీడీపీ ప్ర‌భుత్వం ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీకి వేలకోట్ల రూపాయలు లబ్ధిచేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని.. విద్యుత్ ప్రాజెక్టుపై కాంట్రాక్టర్‌కు ముందస్తు చెల్లింపులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరంలోని కుడి, ఎడమ కాలువల అంచనాల పెంపు నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న కమిటీ.. అంచనాల పెంపుతో కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి చేకూరిందని పేర్కొంది. నిబంధ‌న‌లు ఉల్లంగించార‌ని కమిటీ పేర్కొంది.

జలవనరులశాఖ నాణ్యత నియంత్రణ విభాగం సరిగా పనిచేయడం లేదని క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి అయినట్టు పేర్కొంది. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకపోగా.. ఒప్పందానికి విరుద్ధంగా ధరలు పెంచేశారని నివేదికలో నిపుణల కమిటీ తెలిపింది. సీఎం వైఎస్ జగన్ నియమించిన విశ్రాంత నిపుణులు పీటర్, నారాయణ రెడ్డి, ఐఎస్ఎన్ రాజు, బషీర్, సుబ్బరాయశర్మ, ఆదిశేషు, సూర్యప్రకాష్‌లతో కూడిన కమిటీ తన నివేదికలో పలు సిఫార్సులు చేసింది. ప్రభుత్వానికి 42 పేజీలతో పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మ‌రి జ‌గ‌న్ ఇప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో …..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -