Thursday, March 28, 2024
- Advertisement -

ఏపీ భాజాపా అధ్యక్షుడు కన్నా అరెస్ట్….

- Advertisement -

ఏపీ భాజాపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను సత్తుపల్లి పోలీస్టేషన్ కు తరలించారు. గురజాలలో బహిరంగ సభను నిర్వహించడానికి కన్నా.. ప్రయత్నించగా ఆ సభకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.ఈ ఉదయం ఆయన్ను నిలువరించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలంకాగా, తన వాహనంలో, కార్యకర్తలు వెంటరాగా, శివార్ల వరకూ కన్నా చేరుకున్నారు.

రాజకీయ పరిణామాల దృష్ట్యా గురజాల నియోజకవర్గంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని ఆయనకు చెప్పారు.గురజాల ప్రాంతంలో సభలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదని పోలీసులు బీజేపీ నేతకు వివరించారు. కానీ కన్నా మాత్రం గురజాల వెళ్లడానికే మొగ్గు చూపడంతో ఆయన్ని అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా కన్నా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జగన్ కూడా పోరాటాలు చేసే సీఎం అయిన విషయాన్ని గుర్తు చేశారు. మూడు నెలల్లోనే జగన్ సర్కారు ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని కన్నా ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -