Thursday, March 28, 2024
- Advertisement -

కోడెల చుట్టూ రాజకీయం.. ఏం జరగబోతోంది.?

- Advertisement -

కోడెల శివప్రసాద్ రావు.. మాజీ ఏపీ శాసనసభ స్పీకర్.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టార్గెట్ చేసిన నేత ఈయనే. ఈయన స్వయంకృతాపరాధం కూడా ఇందులో ఉంది. కోడెల చంద్రబాబు హయాంలో స్పీకర్ గా ఉంటూనే సత్తెనపల్లి, నర్సారావుపేటలో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన తీరు.. ఈయన కుమారుడు, కూతురు సాగించిన వసూళ్ల దందాపై బాధితులంతా రోడ్డెక్కడం ఫిర్యాదు చేయడంతో ఇరుకునపడ్డారు.

కోడెల ఫ్యామిలీ సభ్యులపై కేసులు నమోదు కావడం.. వైసీపీ ప్రభుత్వం కఠినంగా ఉండడంతో కుడిదలో పడ్డ ఎలుకలా కోడెల పరిస్థితి తయారైంది.

ఇక ఇటీవల ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్ మాయం ఘటనలో కూడా కోడెల అభాసుపాలయ్యారు. ఆ ఫర్నీచర్ ను ఇంట్లో పెట్టుకున్న బయటపడడం.. వైసీపీ దుమారం రేపడంతో టీడీపీ కూడా ఇరుకునపడింది.

ఇక నిన్నటికి నిన్న కోడెల ఇంట్లో దొంగలు పడి కంప్యూటర్లు ఎత్తుకెళ్లారన్నవార్త కలకలం రేపింది. ఆ విషయంలో వైసీపీ నేత అంబటి సహా చాలా మంది కోడెల డ్రామా అంటూ ఇరుకునపెట్టారు. ఇలా అన్ని విషయాల్లో కోడెలను టార్గెట్ చేసిన వైసీపీ ఇప్పుడు ఆయనను అంపశయ్యపై నిలబెట్టింది. నిన్న రాత్రి కోడెలకు తీవ్ర గుండెపోటు రావడంతో ఆస్పత్రి పాలయ్యారు. ఒకవేళ ఆయనకు ఏదైనా జరిగితే ఇది వైసీపీ చేసిన హత్య అని రాద్ధాంతం చేయడానికి టీడీపీ రెడీగా ఉందట.. అయినా అన్ని చేసిన కోడెలను వదిలి ఈ టీడీపీ నేతలు ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేయడమే విడ్డూరంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -