Friday, March 29, 2024
- Advertisement -

కరోనా మహమ్మారి… ఒక్కరోజే 1.50లక్షల మందికి పాజిటివ్

- Advertisement -

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తగ్గడం లేదు. తన పంజా విసిరుతూనే ఉంది. దాంతో ప్రజలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ప్రపంచంలోనే గడిచిన 24 గంటల్లో అంటే ఒక్కరోజులో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్.వో) కీలక ప్రకటన చేసింది.

కేవలం ఒక్క రోజులోనే 1.50 లక్షల కేసులు నమోదయ్యాయని.. ఇందులో సగానికిపైగా ఒక్క అమెరికాలో ఉన్నాయని డబ్ల్యూహెచ్.వో తెలిపింది. ఆ తర్వాత దక్షిణ ఆసియా మధ్యప్రాచ్య ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయని.. మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని డబ్ల్యూహెచ్.వో చీఫ్ బెడ్రోస్ అధానత్ తెలిపారు. ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాపిస్తోందని.. ప్రమాదకరమైన దశలోకి వచ్చినట్లు డబ్ల్యూహెచ్.వో చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని సూచించారు. మాస్కులు శానిటైజర్లు వాడాలని.. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. మరోవైపు కరోనా వైరస్ కోసం ‘పెవిపిరవిర్’ అనే డ్రగ్ పనిచేస్తుందని.. దీనికి భారతదేశ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. అత్యవసరప పరిస్థితుల్లో ఈ డ్రగ్ ను ఇవ్వాలని సూచించింది.

జూన్ 21న సూర్య గ్రహణం.. ఈ పనులు అసలు చేయొద్దు..!

రైతులకు ఆర్థికంగా అండగా “టొమాటో ఛాలెంజ్”

దేశానికి మేఘా రక్షణ కవచం

డేంజర్ లో భారత్.. ఒక్కరోజే 2003 మంది మృతి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -