Thursday, April 25, 2024
- Advertisement -

ప్రగతి రిసార్ట్స్ కి ఉత్తమ పర్యావరణ అవార్డు

- Advertisement -

పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంలో విశేష కృషి చేస్తున్న ప్రగతి రిసార్ట్స్ సిఎండి డాక్టర్ జిబికె రావు కు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి) ప్రతిష్టాత్మక అవార్డు ప్లాటినం షీల్డ్ ను అవార్డు ను అందచేసింది. శుక్రవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో ఐజిబిసి రాష్ట్ర ఛైర్మన్ శేఖర్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు గురుమీత్ సింగ్, డబ్ల్యూజిబిసి మాజీ అధ్యక్షుడు టాయ్ లీ సియంగ్, నలంద యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సునయన సింగ్ ఈ అవార్డు ను జిబికె రావు కు అందజేశారు.

ఈ సందర్భంగా జిబికె రావు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ని అన్నారు. ఇది పాఠశాల స్థాయి నుంచి పిల్లలకు నేర్పాలని అన్నారు. దీంతో ప్రకృతి తో పిల్లలు మమేకం అవుతారని చెప్పారు. వినాయక చవితి ఉత్సవాలకు మట్టి ప్రతిమలు తయారు చేయడం, 21 ప్రతులు గుర్తుపట్టడం వాటితోనే పూజ చేసేలా పిన్న వయస్సు నుంచే నేర్పించాలని అన్నారు. ప్రగతి లో 35 లక్షలకు పైగా మొక్కలున్నాయని ఇక్కడ ఉండే ప్రతి గదికి 35 వేల మొక్కల చొప్పున ఉన్నాయని తెలిపారు. ఈ అవార్డు పొందడం చాలా సంతోషంగా ఉందని , నాపై మరింత బాధ్యత పెంచింది అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం పథకం చాలా బాగుందని, ఆ విధంగానే ప్రగతిలో అమృత ఆహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అమృత ఆహారంతో మన శరీరానికి మనమే వైద్యులమవుతామని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -