Tuesday, April 23, 2024
- Advertisement -

ఢిల్లీ మాజీ సీఎం శీలా దీక్షిత్ మృతిప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖుల సంతాపం…

- Advertisement -

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయవేత్త షీలా దీక్షిత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.15 ఏళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేరళ గవర్నర్‌గా షీలా దీక్షిత్‌ పని చేశారు. 1998 నుంచి 2013 వరకు ఆమె ఢిల్లీ సీఎంగా పనిచేశారు. 2017 మార్చి నుంచి ఆగస్టు వరకు కేరళ గవర్నర్‌గా సేవలు అందించారు. అమె మృతి పట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

షీలా దీక్షిత్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త వినాల్సి రావడం విచారకరమని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిరకాలం గుర్తుంచుకునే రీతిలో ఢిల్లీకి కొత్త రూపునిచ్చారని కోవింగ్ కితాబిచ్చారు.షీలా దీక్షిత్ కుటుంబసభ్యులకు, అనుయాయులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా షీలా దీక్షిత్ మృతి పట్ల స్పందించారు. షీలా జీ మృతి వార్త వినాల్సి రావడం ఎంతో బాధాకరమైన విషయం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆమె ముద్దుబిడ్డ అని కీర్తించారు. ఆమెతో తనకు వాత్సల్యపూరితమైన అనుబంధం ఉందని రాహుల్ గుర్తుచేసుకున్నారు.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. షీలా జీ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు. స్నేహపూర్వక వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకునేవారంటూ షీలా దీక్షిత్ గురించి పేర్కొన్నారు.షీలా దీక్షిత్ కుటుంబానికి, ఆమె మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -