Tuesday, April 23, 2024
- Advertisement -

ప్ర‌ధాని మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల ఖ‌ర్చు అంతా….?

- Advertisement -

2014 లో ప్ర‌ధానిగా మోదీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఆయ‌న విదేశీ ఖ‌ర్చుల వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. 2014 జూన్‌ నుంచి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మోదీ విదేశీ పర్యటనల కోసం, ఛార్టెర్డ్‌‌ ఫ్లైట్స్‌, విమానాల నిర్వహణ, సదుపాయాల మోదీ రూ. 2,021 కోట్లు వ్యయం చేసిన‌ట్లు ప్ర‌భుత్వం రాజ్యసభలో వెల్లడించింది. ఇప్పుడు ఇదే దేశంలో హాట్‌టాఫిక్‌గా మారింది.

2014 నుంచి 2018 మధ్యలో ప్రధాని మోదీ పర్యటించిన దేశాల జాబితాను కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ రాజ్యసభలో వెల్లడించారు. దీని ద్వారా ప్రస్తుతం భారత్‌లో అత్యధిక విదేశీ పెట్టుబడులు చేసిన టాప్-10 దేశాల్లో ఉన్నట్లు చెప్పారు. 2014లో 30,930.5మిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు రాగా, 2017లో 434 78.27మిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయని తెలిపారు.

అంతకుముందు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్‌ సింగ్ విదేశీ పర్యటనలకు 2009 నుంచి 2014 వరకు రూ.1,346కోట్లు ఖర్చైందని వెల్లడించారు. మోదీ 2014 మే నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 48 విదేశీ పర్యటనల్లో 55 దేశాలను సందర్శించారని వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -