Tuesday, March 19, 2024
- Advertisement -

ఏపీలో అధికారంలోకి 102 సీట్ల‌తో ఆయ‌నొస్తున్నాడు… ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు

- Advertisement -

లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఆదివారం నాడు మీడియా చానళ్లన్నీ ఎగ్జిట్ పోల్స్ తో దుమ్మురేపుతున్నాయి. కేంద్రంలో మ‌రోసారి ఎన్డీఏ కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని అలాగె ఏపీలో వైసీపీ ప్ర‌భంజ‌నం కొనసాగుతుంద‌ని మెజారిటీ స‌ర్వేలు తేల్చిచెప్పాయి.

ఇద‌లా ఉంటె ఫలితాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ, ఫ్రొఫెసర్ నాగేశ్వర్ సర్వే ఫలితాలను తెలియజేశారు. నేను ఈ సర్వేలను వెలువడిస్తున్నది కేవలం జనరల్ ఒపీనియన్‌తో మాత్రమే. నాకు ఎలాంటి సర్వే సంస్థలు లేవు. ఎగ్జిట్ పోల్స్ చేయలేదు. ఒపీనియన్ పోల్ మాత్ర‌మే చెబుతున్నా.. రైట్ అయినా రాంగ్ అయినా తిట్టకండంటూ తెలిపారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలప్పుడు లగడపాటి సర్వేకి పూర్తి భిన్నంగా నేను చెప్పాను అదే నిజమైంది. ఇప్పుడు ఏపీలో కూడా అదే నిజం అవుతంద‌నె అవ‌వాశాలు బ‌లంగా క‌నిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఏపీలో అనుభవానికి ఓటేశారని కాని ఈసారి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కే మొగ్గు చూపార‌ని వెల్ల‌డించారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 98 నుంచి 102 సీట్ల వరకు రావొచ్చని అంచనా వేశారు. టీడీపీ ఈ స్థాయిలో సీట్లు గెలిచేందుకు ఉన్న అవకాశాలు చాలా తక్కువని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. జనసేనకు 3 నుంచి 5 సీట్లు వస్తాయని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లోనూ వైసీపీకి గణనీయమైన స్థాయిలో 15 సీట్ల వరకు రావొచ్చని వెల్లడించారు.

మొత్తం 175 సీట్లను చూస్తే.. వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో 67 సీట్లు గెలుచుకుంది. ఈ సారి కూడా ఇవే సీట్లు గెలుస్తుంద‌న్నారు. సిట్టింగ్ సీట్లు అన్నీ ఎప్పుడూ ఏ పార్టీ గెలవదు. ఓ పది సీట్లు అటూ ఇటూగా గెలవచ్చు.. ఓడొచ్చు. అయితే ఖచ్చితంగా వైసీపీకి 2014 ఎన్నికల్లో ఎన్ని సీట్లు అయితే వచ్చాయో.. ఈసారి ఆ సంఖ్య ఖచ్చితంగా అలా ఉంటుంది.

టీడీపీ విషయానికి వస్తే.. 50-55 సీట్లు ఖచ్చితంగా గెలిచేవి ఉన్నాయి. అంటే వైసీపీ 60-65 సీట్లు, టీడీపీ 50-55 సీట్లు పక్కాగా గెలుచుకునే స్థానాలు ఉన్నాయి. 125 సీట్లలో (ప్లస్ ఆర్ మైనస్) 120-125 సీట్లు చాలా క్లియర్‌గా రిజల్ట్ ఉంద‌న్నారు. మిగతా 50-60 సీట్లలో వైసీపీ 20-25 గెలుచుకుంటే విన్ అవ్వొచ్చు. అదే టీడీపీ గెలవాలంటే 40-45 సీట్లను గెలవాలి. ఈ లెక్కల్లో వైసీపీ నష్టం కంటే లాభం ఎక్కువ.

లగడపాటి చెప్పినట్టుగా టీడీపీకి వంద సీట్లు రావాలంటే.. టఫ్ ఫైట్‌గా ఉన్న ఈ 50-60 సీట్లలో 50 సీట్లు ఖచ్చితంగా గెలవాలి. ఇది చాలా డిఫికల్ టార్గెట్. అందువల్ల చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే అదొక అద్భుతమే. మిరాకిల్ అని చెప్ప‌వ‌చ్చు.ఏ రకంగా చూసినా చంద్రబాబు మళ్లీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం చాలా పెద్ద సవాల్. ఖచ్చితంగా వైసీపీ ఎడ్జ్ ఉందని క్లియర్‌గా అర్ధం అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -