Thursday, March 28, 2024
- Advertisement -

ప్ర‌తీకారం తీర్చుకున్న ఆర్మీ..పుల్వామా ఘ‌ట‌న మాస్ట‌ర్ మైండ్ ఘాజీ హ‌తం..న‌లుగ‌రు జ‌వాన్లు మృతి

- Advertisement -

పుల్వామాలో ఉగ్రదాడిపై ఇండియన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది . ఉగ్ర‌దాడిలో 42మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రదాడి ఘటనలో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది మతమయ్యాడు. పింగ్లాన్ ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం అతనిని మట్టుబెట్టింది. జైషే మహ్మద్ కమాండర్ కమ్రాన్ ఘాజీని సైన్యం హతమార్చింది. ఘాజీతోపాటు మ‌రో క‌మాండర్ కమ్రాన్‌ను కూడా హతమార్చింది.

పింగలాన్‌లోని ఓ ఇంట్లో ఉన్నట్లు తెలియడంతో CRPF జవాన్లు అక్కడకు వెళ్లారు. వెంటనే ఉగ్రవాదులు వాల్లపై కాల్పులు జరపడంతో… మేజర్ సహా నలుగురు జవాన్లు చనిపోయారు. వెంటనే కాల్పులను తిప్పికొట్టిన సైన్యం రెండు గంటలపాటూ పోరాడి… రషీద్ ఘాజీ, కమ్రాన్‌లను మట్టుపెట్టింది.

సీఆర్‌పీఎఫ్‌పై దాడి జరిగిన ప్రాంతానికి దగ్గర్లోనే ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌య‌మిచ్చిన ఇంటి య‌జ‌మాని కూడా హ‌త‌మ‌య్యాడు. హతమైన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరైన రషీద్ ఘాజీ… పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్‌. అతడు ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ నాయకుడైన మసూద్‌ అజార్‌కు అత్యంత నమ్మకస్థుడు. ఘాజీ ఆఫ్ఘనిస్థాన్‌కు చెందినవాడు. 42 మంది జ‌వాన్ల‌ను పొట్ట పెట్టుకున్న కరడుగట్టిన ఉగ్రవాది ఆదిల్‌ అహ్మద్‌ దార్‌కు గురువు. పుల్వామా దాడి అంతా ఘాజీ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగింది. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి వెనుక ఐఈడీ నిపుణుడైన అతడి హస్తం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -