Friday, March 29, 2024
- Advertisement -

జ‌మ్ము,కాశ్మీర్‌లోఆత్మాహుతిదాడి…18మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్లు మృతి

- Advertisement -

జ‌మ్ము, కాశ్మీర్‌లో ఉగ్ర‌వాదులు ర‌క్త‌పుటేరులు పారించారు. యురీ దాడి తర్వాత.. మళ్లీ ఆ స్థాయిలో మారణహోమం సృష్టించారు. పుల్వామా జిల్లాలో CRPF జవాన్లను టార్గెట్ చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగింది. CRPF జవాన్లు ప్ర‌యానిస్తున్న కాన్వాయ్‌ని ఐఈడీ బాంబు పేల్చారు. ఈ పేలుడులో 18 మంది CRPF జవాన్లు మ‌ర‌ణించాగా 40 మందికి పైగా జవాన్లు గాయపడ్డారు. గాయపడ్డవారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జ‌వాన్ల‌తో జమ్ము నుంచి శ్రీనగర్‌కు కాన్వాయ్ ని అత్యధిక తీవ్రత కలిగిన కారు బాంబుతో దాడికి పాల్పడ్డారు.

దీంతో జ‌వాన్ల వాహ‌నాలు తున‌క‌ల‌యి గాల్లోకి ఎగిసి ప‌డ్డాయి. దాడి నుంచి జ‌వాన్లు తేరుకొనే లోపే ఉగ్ర‌వాదులు గ్ర‌నేడ్‌ల‌తో దాడి చేశారు. కొంత మంది జ‌వాన్లు స్పాట్‌లో చ‌నిపోగా కొంద‌రి జ‌వాన్ల శ‌రీర భాగాలు చెల్లాచెదురుగా ప‌డ్డాయి. దీంతో ఆప్రాంతం అంతా భీబ‌త్సంగా మారింది. తీవ్రంగా గాయ‌ప‌డిన జ‌వాన్ల‌ను హెలికాప్ట‌ర్ల ద్వారా ఆర్మీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పుల్వామా జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. దాడి చేసింది తామేన‌ని జైషేమ‌హ‌మ్మ‌ద్ సంస్థ ప్ర‌క‌టించింది. పారిపోయిన ఉగ్ర‌వాదుల‌కోసం ఆర్మీ గాలింపు చ‌ర్య చేప‌ట్టింది. ఈ దాడిపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా తన ట్వీట్ లో తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -