Friday, April 26, 2024
- Advertisement -

అమ‌ర‌జ‌వాన్ల ప‌ట్ల త‌న దేశ భ‌క్తిని చాటుకున్న మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సేహ్వాగ్‌..

- Advertisement -

పుల్వామా ఉగ్ర‌దాడిలో అమ‌ర‌వీరులైన జ‌వాన్ల‌కు దేశ వ్యాప్తంగా ఘ‌న‌మైన నివాళులు అర్పించింది యావ‌త్ భార‌త‌తావ‌ని. అమ‌రుల కుటుంబాల‌ను అదుకొనేందుకు అన్ని రాష్ట్రాలు, సెల‌బ్రిటీలు ముందుకు వ‌స్తున్నారు. అమ‌ర జ‌వాన్ల కుటుంబాల ప‌ట్ల మాజీ క్రికెట్ వీరేంద్ర సేహ్వాగ్ మ‌రో సారి త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. అమరులైన జవాన్ల పిల్లలను తానే చదివిస్తానని హామీ ఇచ్చిన వీరూ.. దేశం పట్ల తనకు ఉన్న సేవాగుణాన్ని చాటుకున్నాడు. జవాన్ల పిల్లల చదువుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సెహ్వాగ్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.

జవాన్లపై ఉగ్రదాడి ఘటనను సెహ్వాగ్ తీవ్రంగా ఖండించాడు. ‘‘ఊహించని దారుణం జరిగిపోయింది. ఉగ్రదాడిలో మన జవాన్లు నెలకొరిగారు. దేశం కోసం అమరులైన జవాన్లను తిరిగి ఎలాగో తీసుకరాలేం. కనీసం వారి కుటుంబాలనునైనా ఆదుకుందాంఅని పిలుపు నిచ్చారు. నా సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జవాన్ల పిల్లలను చదివిస్తాను’’ అని ట్వీట్ చేశాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -