Friday, April 26, 2024
- Advertisement -

గూగుల్ టాప్ సెర్చ్ ట్రెండింగ్ లో కుమార‌స్వామి భార్య రాధిక‌…

- Advertisement -

అత్యంత నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్‌, జేడీఎస్ నేతృత్వంలో కొత్త ప్ర‌భుత్వం కొలువుతీర‌నుంది. ముఖ్య‌మంత్రిగా కుమార‌స్వామి ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. అయితే ఇప్పుడు సోషియల్ మీడియాలో కుమార స్వామి భార్య రాధిక గురింది తెగ వితికేస్తున్నారు నెటిజ‌న్లు.

కుమార‌స్వామి రెండో భార్య రాధిక‌. గతంలో దక్షిణాది భాషల్లో హీరోయిన్ గా కూడా నటించి మంచి పేరు తెచ్చుక‌న్నారు. అయితే నిన్న‌టి వ‌ర‌కు ఆమె అంటే ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌ని ఈపేరు ఇప్పుడు గూగుల్ టాప్ సెర్చ్ ట్రెండింగ్ లో ఉంది. రాజకీయాల్లో ఈమె లేకున్నా, రాధికకు ఉన్న సినిమా నేపథ్యం, ఇప్పుడామెను దేశవ్యాప్తం చేసింది. ఇక రాధిక గురించిన నెటిజన్లు వెతుకుతున్నారు.

తన 16వ ఏటనే తొలిసారిగా వెండితెరపై కనిపించిన ఆమె, మొదట శాండల్ వుడ్ ను తన అందంతో ఊపేశారు. ఆమె నటించిన నీలమేఘ శ్యామ, నినగాగి, తావరిగె బా తంగీ, ప్రేమఖైదీ, రోమియో జూలియెట్ చిత్రాలు 2002లో విడుదల కాగా, ఒక్కసారిగా అగ్రహీరోయిన్ గా ఎదిగిపోయారు. 2006 వరకూ ఆమె కనీసం ఏడాదికి ఐదు సినిమాల్లో తగ్గకుండా నటించారంటే, ఆమె హవా ఎలా సాగిందో తెలుసుకోవచ్చు.

ఇక నందమూరి తారకరత్న హీరోగా ఒకేసారి 9 చిత్రాలకు కొబ్బరికాయ కొట్టిన వేళ, ‘భద్రాద్రి రాముడు’ చిత్రంలో రాధికే హీరోయిన్. ఆ తరువాత తెలుగులో పెద్దగా కనిపించకపోయినా, ‘అరుంధతి’ సూపర్ హిట్ తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన గ్రాఫిక్స్ చిత్రం ‘అవతారం’లో రాధిక హీరోయిన్ గా నటించారు.

కుమారస్వామి ముఖ్య‌మంత్రి అవుతుండ‌టంతో ఆయ‌న భార్య రాధిక గురించి తెగ వెతికేస్తున్నారు నెటిజ‌న్లు. ఆమె గురించి ఖతార్, యూఏఈ, శ్రీలంక, కువైట్ లలో సైతం నెటిజన్లు ఇప్పుడు వెతుకుతున్నారని గూగుల్ వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -