Tuesday, April 16, 2024
- Advertisement -

ఛీ..ఛీ ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా ఉండాల్సిన ఈ మంత్రికి ఇదేం పాడు బుద్ధి

- Advertisement -

ఓవైపు ప్రధాని స్వచ్ఛ భారత్ అంటుంటే.. మరోవైపు ఆ పార్టీ నేతలు మాత్రం… కంపు పనులు చేస్తున్నారు. మంత్రి ప‌దవుల్లో ఉన్న మంత్రులు ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా ఉండాల్సిన వారు పాడు ప‌నులు చేస్తూ ప్ర‌ధానికి చెడ్డ‌పేరు తెస్తున్నారు. అంతేనా నెటిజ‌న్ల‌కు టార్గెట్ అయ్యారు. రాజ‌స్థాన్‌కు చెందిన మంత్రి శంభు సింగ్ ఖేటసర్ మాత్రం బహిరంగ మూత్ర విసర్జన చేసి నవ్వులపాలయ్యారు. దీంతో నెటిజన్లు ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా అజ్‌మేర్‌లో పర్యటించారు మంత్రి శంభూసింగ్, ఈనేపథ్యంలో ఓ గోడ వద్ద ఆయన మూత్ర విసర్జన చేశారు. ఆ గోడపై బీజేపీ పోస్టర్ కూడా ఉంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లంతా తనపై ట్రోల్ చేస్తుండటంతో దీనిపై స్పందించారు మంత్రి. ఆ ఫోటోలో ఉన్నది తాను కాదని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయడం తప్పుకాదన్నారు. అయితే అది నిర్మానుష్యప్రాంతమ ఉండాలంటూ స‌మ‌ర్థించుకున్నారు.

తను తమ సీఎం పోస్టర్‌ పక్కన మూత్ర విసర్జన చేయలదని, ఓ గోడపక్కన చేశానని, అక్కడ ఎలాంటి పోస్టర్‌ లేదని తెలిపారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన స్వచ్ఛ్‌ భారత్‌ ఉద్దేశం బహిరంగ మల విసర్జన చేయవద్దని కానీ, మూత్ర విసర్జన కాదని చెప్పుకొచ్చారు. మల,మూత్ర విసర్జనలు రెండు వేర్వేరన్నారు. బహిరంగ మల విసర్జన వల్ల వ్యాధులొస్తాయని, కానీ మూత్ర విసర్జన వల్ల ఎలాంటి సమస్య ఉండదని తెలిపారు. బీజేపీకి సొంత పార్టీ నేతలలే చెడ్డ పేరు తెస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద మోడీ స్వచ్ఛ భారత్ మిషన్‌కు సొంత పార్టీ నేతలే తూట్లు పొడుస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -